జాతీయ సమైక్యత స్ఫూర్తితోనే జీవనంలో ఆనందం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 12, 2021ఆదిలాబాదు:-

జాతీయ సమైక్యత స్ఫూర్తితోనే జీవనంలో ఆనందం- జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.  ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానిక సంస్థలు.

75వ సంవత్సర ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు 2800 కిలోమీటర్ల సైకిల్ యాత్ర. జిల్లాకు చేరుకున్న సీఆర్పీఎఫ్ అధికారుల సైకిల్ యాత్ర, రాత్రి పోలీస్ శిక్షణ కేంద్రంలో బస ఉదయం మహారాష్ట్ర వైపు పున:ప్రారంభం.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సీఆర్పీఎఫ్ బలగాలు “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరుతో కన్యాకుమారి నుంచి ఢిల్లీ ఘాట్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకోగా మావాల జాతీయ రహదారి శివారులో భారీ ఏర్పాట్ల మధ్య ప్రజల సమక్షంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థలు ప్రజలు పూలమాలలు వేసి పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు,జిల్లా ఎస్పీ స్వయంగా సైకిల్ నడుపుతూ వారితో పాటు రెండు కిలమీటర్ల మేర యాత్రలో పాల్గొన్నారు, అనంతరం రహదారి వెంట వెయ్యి మందికి పైగా ప్రజలు, యువత, విద్యార్థినీ విద్యార్థులు, స్థానిక సంస్థలు పాల్గొని ఆనందోత్సవాల మధ్య దేశభక్తి నినాదాలతో హోరెత్తిస్తూ విజయోత్సవ ర్యాలీలో 410 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జనార్దన్ రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు వచ్చి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ మాట్లాడుతూ, ధైర్యం, సాహసంతో జిల్లా దేశ ప్రజలందరికీ స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు, 2 అక్టోబర్ వరకు దేశ రాజధాని ఢిల్లీకి విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షించారు, జిల్లా ప్రజలకు ఈ యాత్ర స్ఫూర్తి నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు, అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు సీఆర్పీఎఫ్ అధికారులు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ ద్వారా జాతీయ సమైక్యత స్ఫూర్తిని నింపడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు, వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా సాహసమైన యాత్రను కొనసాగిస్తున్న సిఆర్పిఎఫ్ అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు, భారతదేశ ప్రజలకు ఫిట్ ఇండియాలో భాగంగా ఫిట్నెస్, స్ఫూర్తి నింపటానికి చక్కని కార్యక్రమంని కొనియాడారు, రాత్రి, పగలు, ఎండా, భారీ వర్షాలకు లెక్కచేయకుండా సాహస సైకిల్ యాత్ర జిల్లా ప్రజలకు ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర ఇన్చార్జ్ అధికారి కమాండెంట్ విద్యాధర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధానమంత్రి ప్రేరణతో యువతలో దేశభక్తి జాతీయతా భావం రగిలించే దిశగా సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు, ఫిట్ ఇండియాగా యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు, దేశం నలుమూలల నుంచి జవాన్లు ర్యాలీగా బయలుదేరి అక్టోబర్ 2 నాటికి ఢిల్లీలోని గాంధీజీ ఘాట్ వద్ద చేరుకుంటారని వివరించారు,2800 వందల కిలోమీటర్ల ర్యాలీలో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, వేషభాషలు ఉన్నా భారతదేశంలో మనమంతా ఒకటే అన్న భావనను ప్రజల్లో ప్రేరేపించడంమే లక్ష్యమన్నారు. జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఇంతటి గొప్ప సైకిల్ యాత్ర జిల్లాలో ప్రవేశంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొనివుందన్నారు, కొన్ని నెలలపాటు కృషి, శ్రమతో ఎంతో కష్టపడి భారతదేశ యువకులకు సమైక్యంగా ఉండాలనే స్ఫూర్తి కలిగించడానికి రేయింబవళ్ళు కష్టపడుతూ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్న సిఆర్పిఎఫ్ అధికార బృందాన్ని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు, ఈ సహసమైన సైకిల్ యాత్రను చూసి నాలో స్ఫూర్తి కలిగిందని అన్నారు, ఇద్దరు అధికారులు వైకల్యంను లెక్కచేయకుండా సైకిల్ యాత్రలో పాల్గొంటున్న తీరు సాహసంతో కూడుకున్నదన్నారు, ఈ యాత్రను ఘనంగా స్వాగతం పలుకుతూ విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు, భారీ ప్రణాళిక ప్రకారం దేశమంతటా కలియతిరిగే సాహసమైన కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం డిజైన్ చేసిన సిఆర్పిఎఫ్ అధికారులకు అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి వినోద్ కుమార్, సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దినేష్ కుమార్ సింగ్, టిఎస్ఎస్పీ కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, సైకిల్ యాత్రలో పాల్గొంటున్న డిప్యూటీ కమాండెంట్ దినేష్ కుమార్ సింగ్, ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, కానిస్టేబుల్ కృష్ణకాంత్ రాయ్, డిఎస్పి వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణమూర్తి, పట్టణ సిఐలు కె పురుషోత్తం చారి, పోతారం శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఓ సుధాకర్ రావు, గడికొప్పుల వేణు, ఎస్ఐలు జి అప్పారావు,అన్వర్ ఉల్ హక్, జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల శంకర్, యూత్ అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post