జాతీయ సాఫ్ట్బాల్ పోటీల లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు జిల్లా మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘన సన్మానం:-

 

ఈరోజు కమ్మర్పల్లి స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమం లో జరిగిన ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ , గుజరాత్ లో జరిగిన సబ్-జూనియర్ మరియు ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో జరిగిన జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు:1) జి శృతి, 2)జి.మమత 3) ఎస్ .సౌమ్య రాణి, 4) ఎల్.రాణి, 5)జే వైశాలి,6) కే సృజన 7) జి సౌందర్య లు ( సాంఘిక సంక్షేమ కళాశాల,సుద్ధపల్లి)
8) డి.మౌనిక (సాంఘిక సంక్షేమ కళాశాల, తాడ్వాయి),
9) ఏ. హిందూ, 10)ఏ.నందిని లు( సాంఘిక సంక్షేమ పాఠశాల, పోచంపాడ్) ,
11)ఎం మీనా (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం).

లు రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బంగారు పతకాలు అందుకున్న సందర్భంగా క్రీడాకారులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు ఉద్దేశించి మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఆల్ ఇండియా బెస్ట్ ప్లేయర్ గా ప్రత్యేక బహుమతిని అందుకున్న జూనియర్ విభాగంలో జి మమత మరియు సబ్ జూనియర్ విభాగంలో యల్ రాణి లను ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం గంగా మోహన్, డి వై ఎస్ ఓ ముత్తన్న గారు, రాష్ట్ర వాలీ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ వి హనుమంత్ రెడ్డి గారు, D C B సెక్రటరీ సీతయ్య గారు,
జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారు, గురుకుల పాఠశాల స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నీరజ రెడ్డి గారు, సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి ప్రిన్సిపాల్ శ్రీమతి గోదావరి గారు, జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ అనికేత్, వ్యాయామ ఉపాధ్యాయులు కిషన్, గంగాధర్ ,మౌనిక, జోష్ణ లు పాల్గొన్నారు.

Share This Post