జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం, సౌజన్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల అగ్రహారం, మానేరు రచయితల సంఘం సిరిసిల్ల సంయుక్త నిర్వహణలో కేంద్ర సాహిత్య బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ బాలసాహిత్యం సమాలోచన జాతీయ సదస్సు 24 మార్చి 2023 శుక్రవారం రోజున జరుగుతుంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి గారు డాక్టర్ పతిపాక మోహన్ బాల సాహిత్యం సమాలోచన పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాతీయ బాల సాహిత్య సదస్సులో విద్యార్థులు పాల్గొనడం మంచి పరిణామం. ఈ సాహిత్య కార్యక్రమాలకు బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో

డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ప్రిన్సిపల్ సదస్సు సంచాలకులు, డా. M. మల్లారెడ్డి,మానేరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎలగొండ రవి, ఆడెపు లక్ష్మణ్,జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వాసరవేణి పర్శరాములు,పాల్గొన్నారు.

Share This Post