జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనలతో జిల్లా పేరు నిలబెట్టాలి— కలెక్టర్ డి. హరిచందన

జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనలతో జిల్లా పేరు నిలబెట్టాలి— కలెక్టర్ డి. హరిచందన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ  అద్వర్యంలో 30 మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులు, మేజోళ్ళు (షూ) లను జిల్లా కలెక్టర్ డి హరిచందన చేతులమీదుగా అందించారు.  బుదవారం మద్యాహ్నం కలెక్టరేట్ సమావేశమందిరం లో జిల్లా లోని క్రీడాకారులకు 30  మందికి జిల్లా కలెక్టర్ ట్రాక్ సూట్, షుజ్ లను అందించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని క్రీడారంగ  అభివృద్దికి  ఎల్లవేళలా తోడ్పడతానని, క్రీడాకారుల మీద ఉంచిన నమ్మకం వమ్ము చేయకుండా  జాతీయ స్థాయిలో ఎదిగి జిల్లా పేరు ను నిలబెట్టలన్నారు. క్రీడాకారులు అన్ని క్రీడలలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు.  రాబోవు కామన్వెల్త్ గేమ్స్ నాటికి జిల్లా ప్రాతినిథ్యం ఉండేలా అథ్లెటిక్స్ క్రీడాకారులు కృషిచేయాలని, జిల్లాలో క్రీడారంగం అభివృద్ది కి ప్రభుత్వమ్ తప్పక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో విద్యాశాఖ ఏ ఎం ఓ విద్యాసాగర్, ఎస్ఓలు శ్రీనివాస్, పద్మానళిని, సాయినాథ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Share This Post