జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయం  : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

8వ జాతీయ ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలలో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లి ఆశమ ఉన్నత పాఠశాల విద్యార్థి జుమిడి అంజన్న, గైడ్‌ ఉపాధ్యాయుడు రమేష్‌ పర్యవేక్షణలో రూపొందిన ఫీడింగ్‌ చాంబర్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలువడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో జాతీయ స్థాయిలో మంచి ఆవివ్కరణతో నమాజానికి ఉపయోగపడేలా ఉపకరణం తయారు చేసిన విద్యార్థి అంజన్న గైడ్‌ ఉపాధ్యాయుడు రమేష్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్‌రెడ్డి లను అభినందిన్లూ సర్జిఫికెట్‌ ప్రధానం చేసి శాలువాతో నత్కరించారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాలిచ్చే తల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బహిరంగ ప్రదేశాలలో తమ పిల్లలకు తృప్తికరంగా పాలు ఇవ్వడానికి ఈ ఉపకరణం దోహదపడుతుందని, దీనిని అభివృద్ధి పరిచి తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉండే విధంగాప్రయత్నం చేయాలని తెలిపారు. త్వరలో రాష్ట్రపతి భవనంలో నిర్వహించే ఫైన్‌ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్ధన్‌, జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, నంబంధిత
అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post