జాతీయ స్థాయి గోల్ఫ్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అమూల్య ను అభినందించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

జాతీయ స్థాయి గోల్ఫ్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అమూల్య ను అభినందించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

జాతీయ స్థాయి గోల్ఫ్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అమూల్య ను అభినందించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -30:

జాతీయ స్థాయి గోల్ఫ్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అమూల్య ను జిల్లా కలెక్టర్ కె. శశాంక సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంకల్పం పట్టుదల, కృషి ఉంటే ఎంతటి లక్ష్యానైనా సాధించవచ్చని, ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్ లో పేదింటి గిరిజన అమ్మాయి సౌత్ జోన్ స్థాయిలో అత్యంత ప్రతిభ కనబర్చుతూ బంగారు పథకం సాధించడం తో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతి పొందడం జిల్లాకు ఎంతో గర్వకారణమని, పేదరికం దేనికి అడ్డుకాదని, క్రీడల వల్ల మానసిక, శారీరక దారుడ్యం తోపాటు సమాజంలో గౌరవం తో పాటు, భవిష్యత్తుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుపొంది జిల్లాకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట లు తీసుకొని రావడంతో పాటు, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అమూల్య ను అభినందించారు.

Share This Post