జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్ట్ క్రింద మంజూరైన పీజోమిటర్ పరిశీలక బోరుబావి డ్రిల్లింగ్ కార్యక్రమాన్ని భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో, బొమ్మలరామారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి గారి చేతులమీదుగా ప్రారంభింపజేశారు

జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్ట్ క్రింద మంజూరైన పీజోమిటర్ పరిశీలక బోరుబావి డ్రిల్లింగ్ కార్యక్రమాన్ని భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో, బొమ్మలరామారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి  గారి చేతులమీదుగా ప్రారంభింపజేశారు. డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్, హైడ్రో జియాలజిస్ట్ శ్రీమతి స్వాతిశ్రీ, ఎం ఆర్ ఓ, ఎం పి డి ఓ, మెడికల్ ఆఫీసర్లు డా. శ్రావణ్ కుమార్, డా. క్రాంతి హాజరయ్యారు. జిల్లాలో భూగర్భ జలాలు సంతృప్తికరమైన స్థాయి లో ఉన్నాయని, 2016 మే మాసం లో 16.64m లోతులో ఉండగా ప్రస్తుతం 8.44 m పైకి అంటే 8.02 m నీటి మట్టం పెరిగినట్లుగా కలెక్టరు తెలిపారు. అక్టోబరు 2016 లో 9.29మీ లోతులో ఉండగా ప్రస్తుతం 3.66మీ అనగా 5.63మీ నీటి మట్టం పెరగడం ప్రభుత్వం చేపట్టిన పలు నీటి సంరక్షణ కార్యక్రమాల ఫలితమే. ప్రస్తుతమున్న 36 పరిశీలక బావులతో పాటుగా మరో 22 పరిశీలక బావుల డ్రిల్లింగ్ పనులు పూర్తి అయితే నీటి కొలతల్లో ఖచ్చితత్వం పెరుగుతోంది. ప్రతి మూడు సం. లకు ఒక్కసారి చేసే భూగర్భజలాల అంచనాల్లో కూడా ఖచ్చితత్వం పెరిగి ఎంత భూగర్భ జలం లభిస్తుందో తెలుస్తుంది. భూగర్భ జలశాఖ చేపట్టిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభినందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టరు సూచించారు.

Share This Post