జిఓ58 దరఖాస్తులపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

మే 28 నాటికి భూ క్రమబద్ధీకరణ ప్రాథమిక విచారణ పూర్తి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రభుత్వ ఉత్తర్వు 58 దరఖాస్తుల విచారణ కు కలెక్టర్ ఆదేశం

గ్రామాల్లో బృందాల పర్యటన ప్రాంతాల్లో టాంటాం చేయాలి

జీ.ఓ.58 భూ క్రమబద్ధీకరణ పై సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి మే 23:మే 28 నాటికి ప్రభుత్వ ఉత్తర్వు 58 కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తులు ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిఓ 58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ చేపట్టే విధానంపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని కలెక్టర్ తెలిపారు. 2014 కంటే ముందు నిర్మాణాలు ఉన్న 125 చదరపు గజాల్లోపు భూమి ఉన్న దారిద్ర్య రేఖ దిగువన కుటుంబాలకు ఉచితంగా క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, మార్చి 31,2022 వరకు దరఖాస్తులు స్వీకరించి ఉందని కలెక్టర్ అన్నారు
భూముల క్రమబద్ధీకరణకు గాను పెద్దపల్లి జిల్లాలో దాదాపు 4500 పైగా దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ప్రభుత్వ ఉత్తర్వు 58 కింద దరఖాస్తులు వస్తాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో జి.ఓ 58 కింద ప్రాథమిక విచారణ నిర్వహించడానికి 8 బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతి బృందంలో ప్రత్యేక అధికారి, డిప్యూటీ తహసిల్దార్, సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారని, ఈ బృందాలు మండలంలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి జీఓ58 మొబైల్ యాప్ ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

మంథని, రామగిరి మండలాలలో 166 దరఖాస్తులు, రామగుండం మండలంలో 586 దరఖాస్తులు (3 బృందాలు), పెద్దపల్లి సుల్తానాబాద్ మండలాల్లో 207 దరఖాస్తులు, శ్రీరాంపూర్ మండలం లో 129 దరఖాస్తులు, ఎలిగేడు మండలంలో 279 దరఖాస్తులు, అంతర్గం ధర్మారం జూలపల్లి పాలకుర్తి మండల పరిధిలో 199 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

గ్రామాలలో, మున్సిపాలిటీ వార్డుల్లో బృందాలు పర్యటించాయి ముందు స్థానిక సంస్థల చే టాం టాం చేయాలని, క్షేత్ర స్థాయిలో ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిఓ 58 కింద నిర్మాణాలు ఉన్న పేదల భూములను (125 చదరపు గజాల లోపు) మాత్రమే క్రమబద్ధీకరణ చేయాలని, ఖాళీ స్థలాలను, అభ్యంతరకర స్థలాలను క్రమబద్ధీకరించ వద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

2014 కంటే ముందే నిర్మాణాని ధృవీకరిస్తూ కరెంటు బిల్లు , ప్రాపర్టీ టాక్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొదలైన పత్రాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కోర్టు వివాదాలు ఉన్న భూములు, అసైన్డ్ భూములు, మెట్రో అలైన్మెంట్ లో ఉన్న భూములు, ప్రభుత్వ భూములు మొదలైన అభ్యంతరకర భూముల క్రమబద్ధీకరణ చేపట్టవద్దని కలెక్టర్ తెలిపారు.

గ్రామాలలో పర్యటిస్తున్న సమయంలో బృందాలు క్షేత్రస్థాయిలో నిర్మాణాల కొలతలు తీసుకుని యధావిధిగా నమోదు చేయాలని వాటి ఫోటోలను అప్లోడ్ చేయాలని సూచించారు.

125 చదరపు గజాల కంటే అధికంగా ఉన్న భూమి వివరాలు, దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల క్రమబద్ధీకరణ ప్రక్రియ జియో 59 కింద అ ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ఫీజు వసూలు చేసి చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహ మూర్తి ,తాహసిల్దార్ డిప్యూటీ తాసిల్దారు, సర్వేయర్లు ,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post