జిల్లలో ఖరీఫ్ పంట కొనుగోలు విషయంలో మిల్లర్లకు ఉన్న సమస్యలను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మరియు స్తానిక శాశనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

పత్రికా ప్రకటన                                                                తేది 30-10-2021

జిల్లలో ఖరీఫ్ పంట  కొనుగోలు విషయంలో మిల్లర్లకు ఉన్న సమస్యలను పరిష్కరించి   ఎలాంటి ఇబ్బందులు రాకుండా  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  మరియు స్తానిక శాశనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి  అన్నారు.

శనివారం  జిల్లా పౌర సరఫరాల శాఖ, డి యం, ఆధ్వర్యంలో కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  వరి కొనుగోలు పై  తీసుకోవాల్సిన చర్యలపై రైస్ మిల్లర్ల సంఘాలతో  సమీక్షసమావేశం  నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం 1.90,581 మెట్రిక్ టన్నుల పంటను కొంటామని,.  ప్రతి కొనుగోలు కేంద్రంలో ఉండాల్సిన అన్ని కనీస సౌకర్యాలు ఉండేవిధంగా చూసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు చెప్పిన  సమస్యలనుతప్పకుండ పరిశీలించి వరి కొనుగోలు విషయంలో ఒక పద్దతిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.  వరి కి మద్దతు ధర గ్రేడ్-ఏ రకం అయితే క్వింటాలుకు రూ. 1960 సాధారణ రకం అయితే రూ. 1940 చెల్లించడం జరుగుతుందన్నారు.   మిల్లర్లతో ఇంకా పెండింగ్  ఉన్న వరి ని పంపిణి చేయాలనీ అన్నారు.

 

ఎమెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పై ప్రత్యెక దృష్టి పెట్టి రైతులను ధనవంతులను చేయాలనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూమి శాతం విపరీతంగా పెరిగిందన్నారు.  రైతులు పండించిన పంటనుకొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బందిపడకుండా తగు జాగ్రతలు తీసుకుంటామన్నారు.

రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు, తరలింపులో తమకు ఎదురైన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  వాటిని తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ను కోరారు.

 

సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ , డి ఎస్ ఓ రేవతి , డి ఏ ఓ గోవిందు నాయక్, డి ఎం ప్రసాద రావు, ఆర్ టి ఏ పురుసోతం రెడ్డి, మార్కెటింగ్ పుష్ప, ఎం పి పి విజయ్  రైస్ మిల్లర్లు, సంబదిత అధికారులు  పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది.

 

Share This Post