జిల్లాకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగులకు సీనియారిటీ జాబితా , ఖాళీల వివరాలు పరిశీలించి కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                                                                     తేది 29.12.2021

జిల్లాకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగులకు సీనియారిటీ జాబితా ,  ఖాళీల వివరాలు  పరిశీలించి కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

బుధవారం  కల్లెక్టరేట్ లో  సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జి.ఓ.యం.ఎస్. నెo. 317 ద్వారా జిల్లా స్థాయి కమిటీలో చేపట్టిన ఉద్యోగుల కేటాయిoపులకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్ష్యతన విద్యా శాఖ కు సంబందించిన ఉపాధ్యాయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయిoపుల ప్రక్రియ లో భాగంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన 286 మంది    టీచింగ్ , నాన్ టీచింగ్ ఉపాధ్యాయ ఉద్యోగులకు కౌన్సిల్ ద్వారా పోస్టులను కేటాయిoచడo జరిగిందని తెలిపారు. నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్ 3,  ఓ ఎస్ 2. మొత్తం 5 మంది, టీచింగ్  277 మంది ఉపాద్యాయ ఉద్యోగు లు రిపోర్ట్ చేసారని, మిగత నలుగురు రిపోర్ట్ చేయలేదని తెలిపారు.  ఉపాద్యాయ ఉద్యోగుల   కేటాయింపుకు సంబంధించిన ఫైల్స్ ను పరిశీలించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగులకు  సీనియారిటీ ని  చెక్ చేసుకోవాలని, పోస్టింగ్ అయిన వెంటనే జిల్లా అధికారికి రిపోర్ట్ చేయాలనీ అన్నారు. జిల్లా విద్య శాకాదికారి  ఇతర జిల్లాల నుండి  వచ్చిన వారి పేరు, వివరాలను క్రాస్ చెక్ చేయాలనీ, ముందు ఎ జిల్లాలో పని చేశారు , అప్పాయింట్మెంట్ అథారిటీ, సీనియారిటీ జాబితా, అన్ని వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని , వారి పూర్తి డేటా ఎంట్రీ చేయించిన తరవాత ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని   అన్నారు. ఉమ్మడి జిల్లాల సీనియారిటీ జాబితా, సవరించబ డిన  సీనియారిటీ జాబితాలను చెక్ చేసుకోవాలని,  కేటాయింపు ప్రక్రియ లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని , ఎవైన సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.   విద్య శాఖ కు సంబందించిన యూనియన్ లతో మాట్లాడి  కౌన్సిలింగ్ చేసిన   ఫైల్స్  వివరాలను   ఐ ఎఫ్ ఎం ఐ యస్ పోర్టల్ లో డేటా  ఎంట్రీ చేయించాలని   విద్య శాఖ అధికారికి ఆదేశించారు. కౌన్సిలింగ్ లో ఉద్యోగులు కోరిన పనిచేయు ప్రదేశాలను కేటాయిoచడo జరుగుతుందని , సంబంధింత పోస్టులలో కేటాయిoపు జరిగిన ఉద్యోగులు జాయిన్ కావలసి ఉంటుందని తెలిపారు.

సమావేశం లో అదనపు కలెక్టర్  శ్రీ హర్ష, జిల్లా విద్యా శాఖదికారి సీరాజుద్దిన్, ఇందిరా , టి పి యు ఎస్ శ్రీధర్ రెడ్డి, యు టి ఎఫ్ గోపాల్, ఎస్ టి యు  యునుష్ పాషా, జి ఎచ్ ఎం ప్రతాప్  రెడ్డి  ,తదితరులు, పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

Share This Post