జిల్లాకు కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియారిటీ జాబితా , ఖాళీల వివరాలు పరిశీలించి కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                                                    తేది 28.12.2021

జిల్లాకు కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియారిటీ జాబితా ,  ఖాళీల వివరాలు  పరిశీలించి కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

మంగళవారం కల్లెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జి.ఓ.యం.ఎస్. నెo. 317 ద్వారా జిల్లా స్థాయి కమిటీలో చేపట్టిన ఉద్యోగుల కేటాయిoపులకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్ష్యతన కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయిoపుల ప్రక్రియ లో భాగంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిల్ ద్వారా పోస్టులను కేటాయిoచడo జరిగిందని తెలిపారు. శాఖల వారిగా అధికారులతో మాట్లాడి , కేటాయింపుకు సంబంధించిన ఫైల్స్ ను పరిశీలించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన వారు సీనియారిటీ ని చెక్ చేసుకోవాలని, పోస్టింగ్ అయిన వెంటనే జిల్లా అధికారికి రిపోర్ట్ చేయాలనీ అన్నారు. జిల్లా అధికారులు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేరు, వివరాలను క్రాస్ చెక్ చేయాలనీ, ముందు ఎ జిల్లాలో పని చేశారు , అప్పాయింట్మెంట్ అథారిటీ, సీనియారిటీ జాబితా, అన్ని వివరాలు జిల్లా అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని , వారి పూర్తి డేటా ఎంట్రీ చేయించిన తరవాత ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని   అన్నారు. ఉమ్మడి జిల్లాల సీనియారిటీ జాబితా, సవరించబ డిన  సీనియారిటీ జాబితాలను చెక్ చేసుకోవాలని,  కేటాయింపు ప్రక్రియ లో ఎవైన సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని జిల్లా అధికారులకు తెలిపారు.  జిల్లాలోని రెవిన్యూ, వెటర్నరీ, కో ఆపరేటివ్ , వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ, సి.పి.ఓ, కమర్షియల్ టాక్స్, చేనేత జౌళి శాఖ, సమాచార శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ,  ఫైర్ స్టేషన్, ఆర్ అండ్ బి, గిరిజన , ఎస్సి, బి.సి.సంక్షేమ శాఖలు,  మత్స్య శాఖ,  ఇరిగేషన్, పంచాయతి రాజ్, విద్యా శాఖ , ఇతర అన్ని శాఖలకు కౌన్సిలింగ్ చేసి సంబందిత ఫైల్స్  వివరాలను   ఐ ఎఫ్ ఎం ఐ యస్ పోర్టల్ లో డేటా  ఎంట్రీ చేయించాలని  సంబందిత అధికారులకు ఆదేశించారు.  కౌన్సిలింగ్ లో ఉద్యోగులు కోరిన పనిచేయు ప్రదేశాలను కేటాయిoచడo జరుగుతుందని , సంబంధింత పోస్టులలో కేటాయిoపు జరిగిన ఉద్యోగులు జాయిన్ కావలసి ఉంటుందని తెలిపారు.

సమావేశం లో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, టి.ఎన్.జి.ఓ నాగార్జున గౌడ్, జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

 

 

Share This Post