జిల్లాకు పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్

వికారాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద కొన్ని రేషన్ షాపులను ఎంపిక చేసుకొని 70 సంవత్సరాలు దాటిన వయోవృద్దులకు రేషన్ సరుకులు వారి ఇంటి వద్దకు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి సూచించారు.
ఈరోజు వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లిలో రేషన్ షాపును, శివారెడ్డిపేటలోని ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ సెంటర్ ను సందర్శించారు. ఎన్నెపల్లి లోని రేషన్ షాపులో OTP ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా కొంతమంది లబ్ధిదారులు కార్డు ఉండి కూడా రేషన్ బియ్యం రావడం లేదని కమీషనర్ దృష్టికి తీడుకోరాగా, అయన స్పందిస్తూ అన్ని సమస్యల పరిష్కారం కొసం ప్రతి రేషన్ షాపు వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగికుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా చూడాలన్నారు. రేషన్ షాపులలో బియ్యంతో పాటు చెక్కర కూడా అందించాలని డీలర్లను సూచించారు.
శివారెడ్డిపేట లోని అంగన్వాడీ కేంద్రాన్ని మరియు ప్రాథమిక పాఠశాల (ఉర్దూ మీడియం ) ను పరిశీలించారు. గర్భినులకు, బాలింతలకు, విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. అందిస్తున్న మినును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ANM లతో మాట్లాడుతూ గర్భినులు, బాలింతలకు మెరుగైన
వైద్య సేవలు అందించాలని సూచించారు.
అంతకు ముందు ధరూర్ మండలంలోని కేరెళ్ళే గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్వాడు సెంటర్ను పరిశీలించి గర్భినులు, బాలింతలకు, పిల్లలకు మంచి వైద్యం, పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, DRDO కృష్ణన్, DWO లలితా కుమారి, DCSO రాజేశ్వర్, DM సివిల్ సప్లై విమల, Dy. DM&HO జీవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post