జిల్లాకు వచ్చిన బ్యాలట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్లను జాగ్రత్త గా చెక్ చేసి ఈవీఎం గోదాములో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                తేది : 23-01-2023

జిల్లాకు వచ్చిన బ్యాలట్ యూనిట్లు మరియు కంట్రోల్ యూనిట్లను జాగ్రత్త గా  చెక్ చేసి ఈవీఎం గోదాములో బద్రపరచాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత అధికారులకు ఆదేశించారు.

సోమవారం  కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోధామును తనిఖి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కంట్రోల్ యూనిట్లు- 837  , బ్యాలెట్ యూనిట్లు – 1070 వచ్చాయని, ప్రధాన ఎన్నికల సంఘం మరియు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ హైదరాబాదు వారి  ఆదేశానుసారం కొత్త ఈవీఎంలు జిల్లాకు వచ్చాయని,  హైదరాబాద్ ఎలక్షన్  కార్పోరేషన్  ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వారు హైదరాబాద్ నుండి వచ్చిన వారు బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు బాటరీ సహాయంతో  పని చేస్తున్నాయా , లేదా అని చెక్ చేసిన అనంతరం వాటిని గోదాములో  జాగ్రతగా భద్రపరచాలన్నారు. ఈవీఎంలు భద్రపరిచే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బాక్స్ ల లెక్క సరిచూసుకోవాలని   అధికారులకు  ఆదేశించారు. జిల్లాకు వచ్చిన కొత్త బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను  వివిధ రాజకీయ పార్టీల వారి  సమక్షంలో ఈవీఎం గోదాములో బద్రపరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ , తహసిల్దార్లు   వెంకటేశ్వర్లు  ,వీర బద్రప్ప,  సూపరింటెండెంట్ లు  రాజు ,వరలక్ష్మి, ఆర్ ఐ సురేష్ ,   సి పి ఐ వెంకటస్వామి ,వై యస్ ఆర్టిపి రెహమాన్, కాంగ్రెస్ ఇసాక్ , టి ఆర్ ఎస్ మురళి ,  తదితరులు  పాల్గొన్నారు.

 

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచే జారీ చేయడమైనది

 

 

 

 

 

 

 

Share This Post