జిల్లాను నకిలీ విత్తనాలు,కల్తీ మందులు లేని జిల్లాగా రూపొందించాలి..,… అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాను నకిలీ విత్తనాలు,కల్తీ మందులు లేని జిల్లాగా రూపొందించాలి..,… అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాను నకిలీ విత్తన రహిత జిల్లాగా రూపొందించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి వ్యవసాయ , పోలీసు శాఖ అధికారులకు సూచించారు.

గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీ ఈ వో లు , విత్తనాలు, ఎరువుల డీలర్ల తో వానకాలం-2022 సాగుకు సమాయత్తం, నకిలీ విత్తనాల ను అరికట్టడంపై అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, రైతు సంక్షేమానికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందన్నారు. జిల్లాలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నకిలీ విత్తనాలు, కల్తీ మందులను అరికట్టడానికి సహకరించాలని కోరారు.

ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, మందుల అమ్మకాలను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కల్తీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగ కృషి చేయాన్నారు.

నకిలీ, కల్తీ విత్తనాలు ,బయో ఫెర్టిలైజర్స్ పేరిట అమ్మే అవకాశం ఉన్నదని, అట్టి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.అట్టి విషయాన్ని స్థానిక వ్యవసాయ అధికారి కి ,సబ్ ఇన్స్పెక్టర్ కు తెలియజేస్తే అరికట్టవచ్చని తెలిపారు.

రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా అవగాహన కల్పించాలన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు వేసి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మండల డివిజన్ జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా విజిలెన్స్ కమిటీలోని అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు.

డీలర్లు రైతులు అడిగిన ఎరువులు , విత్తనాలను మాత్రమే ఇవ్వాలని, ఇతరత్రా రకాలు అంటగట్టివద్దని స్పష్టం చేశారు.

జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు ,పురుగు మందుల అమ్మకాలు జరగరాదన్నారు. రోజువారి అమ్మకాల వివరాలను అప్డేట్ చేయాలని సూచించారు. డీలర్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు. ఆయా షాపులకు లైసెన్సులు విధిగా ఉండాలని, ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులు పెట్టాలని తెలిపారు.

ఏ ఈ ఓ లు ఈ నెల 15 నుండి లైసెన్స్ ఉన్న ప్రతి విత్తన దుకాణం నుండి విత్తనాల శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపాలని , రిపోర్టు వచ్చిన తర్వాత అమ్మే విధంగా చూడాలన్నారు. ఆయా విజిలెన్స్ కమిటీలు ఆకస్మికంగా తనిఖీలు చేయాలని సూచించారు.

అనుమతి లేకుండా బయో ఫెర్టిలైజర్స్ అమ్మే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో వర్షాకాలం సాగుకు అవసరమైన ఎరువులు, ఫెర్టిలైజర్స్ కు ఎక్కడ కొరత లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తే దిగుబడులు అధికంగా వచ్చి రైతులు లాభపడ్తారని పేర్కొన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడొద్దని, భూసారం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పక్క రాష్ట్రాల నుండి నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు మందులు వచ్చే అవకాశం ఉన్నందున చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మి నట్లయితే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి
ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీలర్లు సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు.

నకిలీ కల్తీ విత్తనాలు మందులు అమ్మిన వారిపై చర్యలు చేపట్టడంతో పాటు అట్టి విషయాన్ని సోషల్ మీడియాలో, పత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.

డి ఎస్ పి బాలాజీ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు ముందే అప్రమత్తమై, గట్టి నిఘా పెట్టి నకిలీ విత్తనాల అమ్మకాలపై సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో సమాచారం ఇవ్వడానికి ఒకరిని ఏర్పాటు చేశామని, అక్రమ కల్తీ విత్తనాలు మందులు ఎరువులు సరఫరా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్న సమాచారంతో చర్యలు చేపడ్తామని పేర్కొన్నారు.

అనంతరం జిల్లాలో ఎలాంటి కల్తీ విత్తనాలు ఎరువులు మందుల అమ్మకాలు జరగకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడి కరుణాకర్ రెడ్డి , డి.ఎస్.పిలు బాలాజీ, నాయుడు, జిల్లా మార్క్ఫెడ్ డీఎం శ్రీదేవి, ఏ డి ఏ లు, మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సి ఈ ఓ లు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post