జిల్లాను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు*

జిల్లాను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు*

*ప్రెస్ నోట్*

*హనుమకొండ*

*మే 12*

*జిల్లాను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు*

గురువారం నాడు కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,

*హరిత హారం*

*మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్* లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ

అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గ‌ట్ల వెంట ప‌చ్చ‌ద‌నం పెంచ‌టం అత్యంత ప్రాధాన్య‌త అంశ‌మ‌ని, ఇందు కోసం యాక్ష‌న్ ప్లాన్ ను సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అదే స‌మ‌యంలో జిల్లా లో అతి త‌క్కువ అట‌వీ విస్తీర్ణం ఉందని, జిల్లాల్లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ప‌చ్చ‌ద‌నం పెంపు కార్య‌క్ర‌మాల‌ను చేయాలన్నారు.

అన్ని ర‌హ‌దారుల వెంట బ‌హుళ ర‌హ‌దారి వ‌నాలు (మల్టీ లెవ‌ల్ అవెన్యూ ప్లాంటేష‌న్) అభివృద్ధి చేయాల‌ని సూచించారు ఔట‌ర్ రింగు రోడ్డు, ర‌హ‌దారి సతరహాలో రాష్ట్రంలోని అన్ని ర‌హ‌దారుల వెంట సుంద‌ర‌మైన పచ్చ‌ద‌నం పెంచాల‌ని తెలిపారు. చెరువు ల వెంబడి మొక్కలను విస్తృతంగా నాటలని అన్నారు.అన్ని గ్రామాల్లో చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలకు మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని, వీటిల్లో ఆశించదగ్గ విధంగా ప‌చ్చ‌ద‌నం పెంచలని అన్నారు.మండ‌లానికి క‌నీసం ఐదు బృహ‌త్ ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌ను పెంచ‌టం లక్ష్యంగా పెట్టుకోవాల‌ని తెలిపారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌చ్చ‌ద‌నం పెంపు కోసం ప్ర‌తీ మున్సిపాలిటీకి ప్ర‌ణాళిక ఉండాల‌ని చెప్పారు.

హరితహారం కార్యక్రమం లో భాగంగా రహదారి వెంబడి నాటుతున్న మొక్కలను, గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా తనిఖీ చేశారు. రహదారి వెంట మూడు వరుసలలో రోడ్డుపై వెల్లే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకండా కొంత స్థలాన్ని వదిలి మొక్కలను నాటాలని, నాటిన ప్రతిమొక్క సంరక్షిపబడాలని, వాటికి ప్రతిరోజు నీరు అందించడం, ట్రీగార్డుల ఏర్పాటు చేయాలనీ అన్నారు.

ఖాళీస్థ‌లాల‌ను గుర్తించి, ప‌చ్చ‌దనం పెంపొందించడం ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌న్నారు. ఎండ‌లు తీవ్రంగా ఉన్నందున హ‌రిత‌హారం మొక్క‌ల‌కు వారంలో రెండు, మూడు సార్లు నీటి వ‌స‌తి క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. . ప్రాంతాన్ని, అక్క‌డి నేల త‌త్వాన్ని బ‌ట్టి నాటాల‌ని, లెక్క‌ల మీద ఆధార ప‌డ‌కుండా మొక్క‌లు నాటే శాతం పెంచ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ ఏ. శ్రీనివాస్ కుమార్, డిఎఫ్ఓ నాగభూషణం, డిపిఓ జగదీష్, కుడా పిఓ అజిత్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సీతారాం,సునీత, తహశీ్దార్లు, ఫారెస్ట్, ఇరిగేషన్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.      

Share This Post