జిల్లాను బాల కార్మికులు మరియు బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి 04ఆగస్టు (బుధవారం ).

జిల్లాను బాల కార్మికులు మరియు బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
బుధవారం ప్రగతి భవన్ కాన్ఫరెన్స్ హాల్లో లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్, ఐసిడిఎస్ అధికారులతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమీక్షా సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ ముందుగా కమిషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడి వారి పరిరక్షణకై జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని మహా ముత్తారం, పలిమెల మండలాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని బాల్య వివాహాలు జరగకుండా నిర్మూలించేందుకు గ్రామాలలో ఉన్న గ్రామ సర్పంచి, పంచాయతీ సెక్రెటరీ, అంగన్వాడి సిబ్బంది, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 640 అంగన్వాడీ సెంటర్స్ కలవని ప్రతి అంగన్వాడీ టీచర్, వర్కర్ గ్రామాల్లో ఎక్కడైనా బాలల హక్కులను ఉల్లంఘించి పనిలో పెట్టుకున్న ,బాల్య వివాహాలు జరగడానికి ఎవరైనా తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నా అటువంటి వారి సమాచారం ముందుగా గుర్తించి తెలియజేయాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించేటప్పుడు చైల్డ్ లేబర్, బాల్య వివాహాలపై చర్చించాలని ఈ సమావేశాలలో పూజారులు కూడా పాల్గొనేలా చూడాలని ఎక్కడైతే బాల్య వివాహాలు ఆపడం జరిగిందో వారికి రీహాబిలిటేషన్ కూడా కల్పించడం అంతే ముఖ్యమని అన్నారు. తల్లిదండ్రుల ను కోల్పోయిన పిల్లలను గుర్తించి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలల హక్కుల పరిరక్షణకై వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలల హక్కుల పరిరక్షణకై ప్రభుత్వ పరంగా అన్ని సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బృందారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo లో బాలల హక్కుల పరిరక్షణకై కృషి చేసేందుకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తానని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు బాగానే కష్టపడుతున్నారని ఎక్కడో చిన్న చిన్న లోపాలు కనపడటం సర్వసాధారణమని చిన్న చిన్న లోపాలను నివృత్తి చేసుకుని మండలాల్లో ఉన్న పోలీసు యంత్రాంగం ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే బాలల హక్కుల దృష్టిలో ఉంచుకొని కేసు నమోదు చేసినట్లు అయితే న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. వీధి బాలలు ఎక్కడైనా దొరికినట్లు అయితే వారికి రిహబిలెషన్ సెంటర్ లో పంపించి విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. బాలల పరిరక్షణ కమిషన్ సభ్యులు శ్రీమతి శోభారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు మంది సభ్యులతో కమీషన్ ఏర్పడి జిల్లాలో భూపాలపల్లి, ములుగు ఇన్ఛార్జిగా తీసుకుని బాలల హక్కుల పరిరక్షణకై పాల్పడుతున్నట్లు, బాలలకు హెల్త్, ఎడ్యుకేషన్, చైల్డ్ లేబర్ గా మారుతున్న విధానాల గురించి ముందుగానే గుర్తించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమావేశం నిర్వహించినప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలని వారి భాగస్వామ్యం చాలా అవసరమని అన్నారు. బాల్య వివాహాల నుంచి రక్షించిన బాలలను రిహాబిలిటేషన్ కల్పించడానికి బాలసధనాలు అవసరమని అన్నారు. గ్రామాలలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి బాల్య, వివాహాలు రద్దు చేయడానికి గ్రామ సర్పంచి, సెక్రటరీలకు అవగాహన కల్పించాలన్నారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు రద్దు.కాబట్టీ బాలల హక్కుల పరిరక్షణ కై అన్ని శాఖల అధికారులు సమన్వయం చాలా అవసరమని అన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా ఉన్న పిల్లలకు బాలల సహాయ కిట్స్ అందించారు
ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వేణుగోపాల్, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమఅధికారి అవంతిక, బీసీ డెవలప్మెంట్ అధికారిని శైలజ, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, సంబంధిత ఐసీడీఎస్ సూపర్వైజర్లు, చైల్డ్ లైన్, సఖి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు
…………………………….
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ద్వారా జారీ చేయడమైనది

Share This Post