జిల్లాలలో డిసెంబర్ 31 వరకు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మరియు ఐ టి శాఖ మంత్రి కె.తారక రమ రావు తెలిపారు.

జిల్లాలలో డిసెంబర్ 31 వరకు  వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు, మరియు ఐ టి శాఖ మంత్రి కె.తారక రమ రావు తెలిపారు.

బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య అధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ గార్లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు .

ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెరియంట్ ఒమ్రికాన్ వచ్చినందున మూడవ దశ ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినషన్  రెండు డొసులు వంద శాతం ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ అయితే తక్కువ వ్యాక్సిన్ వేశారో గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పూర్తి చేయాలని సూచించారు.  వ్యాక్సినేషన్ శాతం తక్కువ ఉన్న జిల్లా లో కలెక్టర్ లు ప్రత్యెక దృష్టి సారించి వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. పంచాయత్ రాజ్ శాఖ, మున్సిపాలిటీ, జెడ్పి చైర్మన్ సహకారాలతో డిసెంబర్ 31 వరకు 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలనీ అన్నారు. రాష్ట్రం లోని ప్రజలను  కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుండి కాపాడుకోవాలంటే వాక్సినేషన్ ఒక్కటే మార్గం అయినందున ప్రతి ఒక్కరూ  వాక్సిన్ వేసుకునేలా చూడాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లాలోని ప్రతి మండలం , గ్రామం, వార్డుల వారిగా రివ్యూ చేసుకోని, వాక్సిన్ వేసుకొని వారిని గుర్తించి వాక్సిన్ వేయించాలని అన్నారు.  వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపాలని సూచించారు.

రాష్ట్ర ఐ.టి. మరియు మున్సిపల్ శాఖామంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ కరోనా మొదటి, రెండవ దశల ప్రభావాన్ని  చూశాము,   మూడవ దశ రాకుండా ముందు జాగ్రతలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు మొదటి , రెండవ దశలలో నేర్చుకున్న అంశాలు మూడవ దశలలో ఎదురుకాకుండా చూసుకోవాలని అన్నారు. పత్రికలు, మరియు సోషల్ మీడియా లో వాక్సినేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎంత శాతం వాక్సినేషన్ పూర్తి అయింది అనే  సమాచారాన్ని ఎప్పటికప్పుడు  ప్రజలకు చేరవేయ్యాలని అన్నారు. ప్రజలకు సరి అయిన సమాచారం అందించేవిధంగా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేయాలనీ అన్నారు. జిల్లాకు సంబంధించిన సమాచారం మొత్తం జిల్లా కలెక్టర్ ద్వారా వెళ్ళాలని అన్నారు. డిసెంబర్ 31 వరకు 100 శాతం వాక్సినేషన్ పూర్తి అయ్యేలా ప్రణాళిక తయారు చేసుకొని యంత్రాంగం ముందుకు కదలాలని తెలిపారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, స్పెషల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యం లో అన్ని శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయము తో రాష్ట్రం లోని  పాటశాలలు, కళాశాలలు, ప్రారంభించబడినవని, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి 50 శాతం వాక్సినేషన్ పూర్తి అయిందని, మిగిలిని వారికి కుడా వాక్సిన్ వేసి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు. అత్యవసరంగా గురుకుల హాస్టల్స్ లో ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకునేలా చూడాలని, కోవిడ్ నియమాలను పాటిస్తూ  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలం , గ్రామం లో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లలో వాక్సినేషన్ శాతం తక్కువ ఉన్న పి.ఎచ్.సి ల పై దృష్టి పెట్టి , 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేస్తామని అన్నారు.  మొదటి డోస్ తీసుకున్న వారికీ డిసెంబర్ లో రెండవ డోస్ వస్తుంది,  స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందరికి రెండు డోస్ లు పూర్తి అయ్యేలా చూస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలను వంద శాతం వాక్సినెటెడ్ గ్రామాలుగా తీర్చి దిద్దుతామని  అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డి.పి.ఓ శ్యాం సుందర్, డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, డి.ఇ.ఓ సిరాజ్జుద్దిన్, జెడ్పి.సి.ఇ.ఓ విజయ నాయక్, డాక్టర్ శశికళ, మున్సిపల్ కమీషనర్లు జానకి రామ్ సాగర్, నర్సయ్య, తహితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

Share This Post