జిల్లాలో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేనులను నంబంధిత శాఖల నమన్వయంతో త్వరగా పరివ్మరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధునూదన్ నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్.ని., ఎన్.టి. అట్రాసిటీ నివారణపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ నమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారి రవీందర్రెడ్డి, డి.సి.పి. ఉదయ్కుమార్రెడ్డిలతో కలిని పోలీను, రెవెన్యూ మున్సిపల్, ఎన్.సి.. బి.సి. కార్పొరేషన్, విద్యుత్ శాఖలతో పాటు నంబంధిత శాఖల అధికారులు, కుల నంఘాల నాయకులతో నమీక్ష నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్నకేనులను నత్వరమే పరివ్యరించే విధంగా అధికారులు చర్యలు తీనుకోవాలని, బాధితులకు తగు న్యాయంతో పాటు నష్టపరిహారం త్వరగా అందేలా కృషి చేయాలని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మండల, గ్రామ స్థాయిలో నమావేశాలు ఏర్పాటు చేని ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు చర్యలు తీనుకోవాలని, కేనుల పరిష్కారంలో భాగంగా చేసే డి.ఎన్.ఎ. నివేదిక ఆలన్యం కాకుండా అధికారులు దృష్టి సారించాలని, ఎఫ్.ఐ.ఆర్. విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పోలీను వారు జిల్లా కలెక్టర్కు తెలియజేయాలని, వెంటనే చర్యలు తీనుకుంటామని తెలిపారు. ప్రతి నెల నిర్వహించే నివిల్ రైట్స్ డే నమావేశానికి మండల స్థాయి అధికారులు విధిగా హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్ ఎ.సి.పి.లు అఖిల్ మహాజన్, నరేందర్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజన్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, ఎన్.సి. కార్పొరేషన్ ఈ.ఓ. దుర్గాప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్ అలీ అప్పర్, కార్యనిర్వాహక నభ్యులు అత్తి నరోజ, కమిటీ నభ్యులు జిల్లపెల్లి వెంకటేష్, రేగుంట లింగయ్య, బచ్చల అంజయ్య, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.