జిల్లాలోని అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామలిగా ఎదగాలి: జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ పల్లెలు సర్వతోముఖాభివృద్ది.

– జిల్లాలోని అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా ఎదగాలి

– జిల్లాలో తొలి తెలంగాణ క్రీడా* *ప్రాంగణంను రంగంపేట లో ప్రారంభo

-జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
—————————-

సీఎం కేసీఆర్ దార్శనికతతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ పల్లెలు సర్వతోముఖాభివృద్ది చెందుతున్నాయనీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని పల్లె ప్రగతి కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోనీ ఆదర్శ గ్రామాలుగా మారాలన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల తో కలిసి ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేటలో శుక్రవారం చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గ్రామ సందర్శన చేశారు.

అనంతరం పల్లె ప్రగతి 5 వ విడత కార్యక్రమంలో
గ్రామ సభ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ లు పాల్గొన్నారు.

గ్రామ సభలో పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశ్యాలు,లక్ష్యాలు వివరించిన పల్లె ప్రగతి గ్రామ ప్రత్యేక అధికారి రాజు వివరించారు.
నాలుగవ విడత ల పల్లె ప్రగతి విజయాలను,
గ్రామ పంచాయితీ ప్రగతి నివేదిక వివరించిన పల్లె ప్రగతి గ్రామ కార్యదర్శి రవి వివరించారు.

రాజన్న పేట గ్రామం లో 5 విడత పల్లె ప్రగతి కార్యక్రమం ను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ….
జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుండి ఈ నెల 18 వ తేదీ వరకూ 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తునట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల అభివృద్ధి కి దూరంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు.

తెలంగాణ వస్తే ఏం వస్తుంది అనే వ్యక్తులకు కాలర్ ఎగరేసి చెప్పండి….. పల్లెలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని అన్నారు. స్వరాష్ట్రo లో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమయ్యాయి, అంగన్వాడి సేవలు మెరుగయ్యాని చైర్పర్సన్ తెలిపారు.
75 ఏండ్ల స్వాతంత్ర్య భారతావనిలో తమ అభివృద్ధి గురించి, గత పాలకులు అవలంభించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడిందన్నారు. వారిలో గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలగిపోయేలా, ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అన్నారు.

అది నిరూపిస్తారా….
లేదంటే విమర్శలు మానుకోవాలి
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్

 

పంచాయతీలకు ప్రతి నెల రూ. 256.66 కోట్లు విడుదల చేస్తున్నదన్నారు.
కేంద్రం ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో మంజూరు చేయలేక పోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీ లకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చే ప్రతి పైసా పెండింగ్ లేకుండా క్రమం తప్పకుండా నిధులు ప్రతి నెలా విడుదల చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ గ్రామాలకు ఇచ్చే నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుందని అన్నారు.
అలా కాదని ఎవ్వరైనా నిరూపించాలని సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదనీ నిరూపించాలని లేదంటే గమ్మునుండాలని
తన జెడ్పీ చైర్ పర్సన్ అన్నారు.

 

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఆ ఉద్దేశ్యాలు రాజన్నపేట గ్రామంలో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ మౌలిక సదుపాయాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అనే అంశంపై అధికారులు ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు .తెలంగాణ హరితహారం కార్యక్రమం లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ బాగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏపుగా పెరిగిన మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు .

గ్రామాల్లో ప్రమాదకరమైన బోరు బావులు, ఓపెన్ బావులను పూడ్చి వేయాలన్నారు. శిథిలావస్థలో చేరిన కట్టడాలను కూల్చివేయాలని అన్నారు.

జిల్లాలోని అన్ని తెలంగాణ క్రీడా ప్రగతి ప్రాంగణాలు 15 రోజుల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సానిటేషన్ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలని సూచించారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఈగలు వృద్ధిచెంది ప్రజలు కీటక జనిత వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నందున ఒక్క నీటి బొట్టు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోనీ పాఠశాలల్లో మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రక్తహీనత కేసులు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ , ICDS అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.

సిజేరియన్ ప్రసవాల వల్ల స్వీయ నష్టం ఎక్కువనే విషయం గుర్తెరగాలి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు కే ప్రతి ఒక్కరు ముగ్గు చూపాలన్నారు . మొదటి కాన్పు తప్పనిసరిగా సాధారణ ప్రసవం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ – హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనీ , సర్వే ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ హెల్త్ కార్డుల వల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉచిత మందులు, వైద్యసేవలు అందించే ఆస్కారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాజన్న పేట నర్సరీ నీ సందర్శించారు .
అదే గ్రామంలో కల్లూరి సుధాకర్ రెడ్డి తన క్షేత్రంలో చేపట్టిన కూరగాయల సాగును పరిశీలించి అభినందించారు. వారి విజ్ఞప్తి మేరకు రైతుకు పందిల్ల సాగు యూనిట్ ను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. కూరగాయల సాగు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
—————————-
*రంగంపేట తొలి తెలంగాణ క్రీడా* *ప్రాంగణంను ప్రారంభించిన జిల్లా ప్రజా* *పరిషత్ చైర్ పర్సన్,జిల్లా కలెక్టర్*

—————————-
జిల్లాలోని మొట్ట మొదటి తెలంగాణ క్రీడా ప్రాంగణంను ప్రారంభించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్,జిల్లా కలెక్టర్ రంగంపేట గ్రామంలో ప్రారంభించారు.

క్రీడారంగంలో యువతను ప్రొత్సహించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చన్న ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మదన్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్, స్థానిక ఎంపీపీ, జడ్పిటిసి, స్థానిక ప్రజా ప్రతినిధులు ,మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు.
——————————

Share This Post