జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (VCPC) సమావేశాలు నిర్వహించి, బాలల సమస్యల పై చర్చించి, సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                             తేదీ 8.11.2021

 

జిల్లాలోని  అన్ని గ్రామాలలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (VCPC) సమావేశాలు నిర్వహించి, బాలల సమస్యల పై చర్చించి, సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జేన్సి సమావేశం లో మాట్లాడుతూ మండల స్థాయిలో అధికారులు (VCPC) సమావేశాలు నిర్వహించి , డ్రాప్ అవుట్ అయిన పిల్లలను తిరిగి పాటశాలలకు పంపించేలా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని, స్కూల్స్ లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తల్లితండ్రులు పిల్లలకు ఇతర పనులు చెప్పకుండా చదువు పైనే దృష్తి పెట్టెలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. (సామ్ – మామ్) SAM-MAM పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించాలని,వారి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని అన్నారు. అంగన్వాడి సెంటర్ లలో పిల్లల ఆరోగ్యం సమస్యల  పై , గ్రామాలలో జరుగుతన్న చైల్డ్ లేబర్, బాల్య వివాహాల సమస్యల పై బాలల పరిరక్షణ కమిటీ సమవేశాలలో  చర్చించి, సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశాలలో సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తల్లితండ్రులు కుడా సమస్యల పై మాట్లాడాలని అన్నారు.

అన్ని గ్రామాలలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. ఓటర్ లిస్టు ప్రకారము ఇంటింటికి తిరిగి వాక్సిన్ వెయ్యాలని, మండల స్పెషల్ అధికారులు పెండింగ్ ఉన్న గ్రామాలలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి వాక్సిన్ వేయాలని అన్నారు. ప్రజలందరు వాక్సిన్ వేసుకునేలా చూడాలని అన్నారు.

అనంతరం ప్రజావాణి లో వివిధ సమస్యల పై వచ్చిన పిర్యాదులను స్వీకరించారు. మొత్తం ప్రజావాణి పిర్యాదులు 67 వచ్చాయని, ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించినవి వచ్చాయని, వివిధ అంశాల పై వచ్చిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యదుదారులకు హామీ ఇచ్చారు.

సమావేశం  లో అదనపు కలెక్టర్ లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, ఆర్.డి.ఓ రాములు, జిల్లా అధికారులు , తదితరులు పాల్గొనారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

 

 

Share This Post