జిల్లాలోని అన్ని దళితవాడలు, గిరిజన ఆవాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా చేపట్టవలసిన పనులను గుర్తించి ఈ నెల 12 లోగా నివేదిక పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు

జిల్లాలోని అన్ని  దళితవాడలు, గిరిజన ఆవాస  ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా చేపట్టవలసిన పనులను గుర్తించి ఈ నెల 12 లోగా నివేదిక పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు

జిల్లాలోని అన్ని దళితవాడలు, గిరిజన ఆవాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా చేపట్టవలసిన పనులను గుర్తించి ఈ నెల 12 లోగా నివేదిక పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి పంచాయతీ అధికారులు, ఏం.పి డి.ఓ.లు, ఎం.పి.ఓ.లు, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, పంచాయత్ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితవాడలు, గిరిజన నివాస ప్రాంతాల్లో భౌతికంగా ఇంకా మెరుగుపరచుటకు అంతర్గత సి.సి.రోడ్లు, సి.సి. మురుగు కాలువలు, వీధి దీపాలు, విద్యుత్ సంబంధిత పనులు, మిషన్ భగీరథ పైప్ లైన్ ల ఏర్పాటు వంటి చేపట్టవలసిన పనులు గుర్తించాలని అన్నారు. ఇందుకోసం ఏం.పి డి.ఓ. అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని ఇందులో ఏం.పి. ఓ., పంచాయత్ రాజ్, మిషన్ భగీరథ, విద్యుత్ అధికారులు సభ్యులుగా ఉంటారని అన్నారు. వారు ఈ నెల 12 లోగా మండలంలో దళిత వాడ, గిరిజన ఆవాస ప్రాంతాలను వెంటనే సందర్శించి అక్కడ పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయుటకు ఇంకా చేపట్టవలసిన పనులు గుర్తించి నిర్దేశించిన ప్రొఫార్మాలలో నివేదికలు పంపాలని కోరారు. ఇదే మాదిరి అన్ని మునిసిపాలిటీలనోని దళితవాడలో చేపట్టవలసిన పనులను గుర్తించాలని మునిసిపల్ కమీషనర్ల సూచించారు. ప్రధానంగా ఎంత మేర సి.సి.రోడ్లు , సి.సి. డ్రైన్లు నిర్మించాలి, అంచనా వ్యయం ఎంత, వీధి దీపాల ఏర్పాటుకు ఎన్ని విద్యుత్ స్థంబాలు అవసరమవుతాయి, ఇంటిమీద నుండి వెళ్లే విద్యుత్య్ తీగలను తొలగించడానికి ఎంత ఖర్చవుతుంది తెలపాలని అన్నారు. అదేవిధంగా ఎన్ని ఇళ్లున్నాయి, ఇంకా ఎన్ని నీటి కు కుళాయిల కనెక్షన్ ఇవ్వాలి, పైప్ లైన్ ల లీకేజీలు ఉన్నాయా తదితర వివరాలు నివేదికలో పొందుపరచాలని అన్నారు.
పల్లె ప్రగతి పనులను సమీక్షిస్తూ పచ్చదనం- హరిత హారానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ మిగిలి పోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వైకుంఠ ధామాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బృహత్తర పల్లె ప్రకృతి వనం క్రింద గుర్తించిన ప్రాంతాలను అభివృద్ధి పరుస్తూ మొక్కలు నాటాలని సూచించారు. బయో ఫెన్సింగ్ చేయాలని, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారుల వెంట మల్టీ లెవెల్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారి కమలాకర్, విద్యుత్ డి.ఈ. మల్లేశం, మునిసిపల్ కమీషనర్లు, డివిజనల్ పంచాయత్ అధికారులు ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post