జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్ల పరిధి లో ఉన్న ధరణి ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మండల తహసిల్దార్లకు ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                         తేదీ 15-11-2021

జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్ల పరిధి లో ఉన్న  ధరణి ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మండల తహసిల్దార్లకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నుండి అన్ని మండలాల తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ వారం రోజుల్లో ధరణి పెండింగ్ దరఖాస్తులను  క్లియర్ చేయాలనీ , మండల పరిధి లో ఉన్న గ్రామాలకు సంబంధించిన ధరణి దరఖాస్తులను ప్రతి రోజు ఉదయం నుండి  సాయంత్రం వరకు ఎన్ని వీలైతే అన్ని పెండింగ్ దరకాస్తులను  పూర్తి  చేసి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం లో అందజేయాలని, సాక్ష్యాలు ,తిరస్కరించిన, ఆమోదించిన  తదితర కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి క్లియర్ చేయాలని తహసిల్దార్లకు ఆదేశించారు.

అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని మండల ప్రత్యెక  అధికారులు, వాక్సినేషన్ శాతం తక్కువ ఉన్న గ్రామాల పై దృష్తి సారించాలని, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి  ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి 100 శాతం వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.  ఎంపిడిఓ లు, పంచాయతి సెక్రటరీ లు, ఎఎన్ఎం లతో సమావేశాలు  ఏర్పాటు చేసుకొని  ప్రతి గ్రామంలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి అయ్యే విధంగా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మొదటి  డోస్ తీసుకుని   84 రోజులు దాటిన వారి లిస్టు కోవిడ్ పోర్టల్ లో చెక్ చేసి  ఎంత మంది పెండింగ్ ఉన్నారో గుర్తించి వారికీ రెండవ డోస్ వ్యాక్సిన్ వేయాలని,  ఆశా లు, ఎఎన్.ఎం లు, పంచాయతి సెక్రటరీ లు ప్రతి రోజు గ్రామాలలో ఇంటింటికి తిరిగి వాక్సిన్ వేస్తున్నారా లేదా ?,  ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని  అన్నారు.   ప్రతి గ్రామంలో  ప్రజలందరు వాక్సిన్ వేసుకునేలా వారికి అవగాహన కల్పించి జిల్లా లో 100 శాతం పూర్తి చేయాలని  అన్నారు.

తదనంతరం ప్రజావాణిలో   పిర్యాదులు సమర్పించడానికి వివిధ గ్రామాల నుండి  వచ్చిన ప్రజల నుండి  ధరఖాస్తులను స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి లో మొత్తం 88  పిర్యాదులు  వచ్చాయని ,  80 భూ సమస్యలు,  8 ఇతర సమస్యలకు సంబంధించిన పిర్యాదులు వచ్చాయని    తెలిపారు.  ప్రజావాణి లో  వచ్చిన ధరఖాస్తులను  పరిశీలించి వాటిని సంబంధిత అధికారులకు  పంపి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.

 

సమావేశం  లో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

Share This Post