జిల్లాలోని అన్ని హాస్టల్స్ , రెసిడెన్షియల్ స్కూల్స్‌ లను తనిఖీ చేసి రిపోర్ట్ అందజేయండి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

జిల్లాలోని అన్ని హాస్టల్స్ , రెసిడెన్షియల్ స్కూల్స్‌ లను తనిఖీ చేసి రిపోర్ట్ అందజేయండి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——–
జిల్లాలోని అన్ని హాస్టల్స్ , రెసిడెన్షియల్ స్కూల్స్‌ లను ఆగస్ట్ 1 న ( సోమవారం) సాయంత్రం లోగా తనిఖీ చేసి, ఆ వెంటనే రిపోర్ట్ అందజేయాలని అధికారులను
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

మండల ప్రత్యేక అధికారులు, హాస్టల్ దత్తత అధికారులు నేడు ( సోమవారం) ఈ తనిఖీ లు చేపట్టాలన్నారు.

తనిఖీ చేసిన సందర్భంలో వసతి గృహంలో ఉన్న వంట మనిషి, కామాటి, సిబ్బంది అనుభవం, వారు వండుతున్న సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించాలని, వంటకు మిషన్ భగీరథ నీటిని వాడే విధంగా చూడాలని, బావి నీరు వాడకుండా చూడాలని, శానిటేషన్ పాటించే విధంగా చూడాలని, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు పంపాలని, వసతి గృహంలో వెంటనే మార్పు చేయవలసిన వాటి వివరాలు తెలపాలని, పిల్లలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని, స్టోర్ రూం లను పరిశీలించాలని, నాణ్యమైన వస్తువులను, తాజా కూరగాయలను వాడే విధంగా చూడాలని తెలిపారు. టాయిలెట్ లు ప్రతిరోజు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఏమైనా లోపాలు ఉన్న, అత్యవసరంగా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్న రిపోర్ట్ లో ప్రస్తావించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

బిసి గురుకులంలో పుడ్ పాయిజన్ కాలేదు
– జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులో నీ మహాత్మా జ్యోతి రావు పులే వెనక బడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల కథనాల పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తక్షణమే స్పందించారు.

వెంటనే జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు నేతృత్వంలో వైద్యుల బృందాన్ని పెద్దూరు శివారులో నీ మహాత్మా జ్యోతి రావు పులే వెనక బడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల కు జిల్లా కలెక్టర్ పంపారు.
వారం రోజుల పాటు గురుకులంలో ఉండాలని Rashtriya Bal Swasthya Karyakram (RBSK) వైద్యులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు కామెంట్స్:

గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరగలేదు. తేల్చి చెప్పిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు నేతృత్వంలో నీ వైద్యుల బృందం తేల్చి చెప్పింది.
వర్షాకాలంలో సహజంగా వచ్చే
సాధారణ వైరల్ ఫీవర్ లు, జలుబు, దగ్గు తో కొద్ది మంది విద్యార్థులు బాధపడుతున్నారనీ జిల్లా వైద్యాధికారి తెలిపారు.
వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని…విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏలాంటి ఆందోళన చెందొద్దనీ విజ్ఞప్తి చేశారు. Rashtriya Bal Swasthya Karyakram (RBSK) వైద్యుల బృందం గురుకులంలో వారం రోజులు పాటు ఉండి వైద్య సేవలు అందిస్తుందన్నారు.

——————————-

Share This Post