జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ అక్రిడి టేషన్ కార్డులు మంజూరు చేస్తాం : జిల్లా కలెక్టర్అనురాగ్ జయంతి

జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ అక్రిడి టేషన్ కార్డులు మంజూరు చేస్తాం : జిల్లా కలెక్టర్

-జిల్లాలో ఇప్పటి వరకూ 309 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు
——————————

2022 -24 సంవత్సరాలకు గాను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందజేసే అక్రిడిటేషన్ కార్డులను జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ మంజూరు చేస్తామని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హల్ లో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది.

వచ్చిన దరఖాస్తుల జాబితాను జిల్లా పౌర సంబంధాల అధికారి సభ్యులకు కమిటీ ముందు ఉంచారు.
జాబితాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ సభ్యులు
అన్ని కేటగిరిలో నీ అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్ లకు కార్డుల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపారు.

ఇంకా కొద్ది మంది అర్హులు మిగిలి ఉన్నారని వారికి కూడ సాధ్యమైనంత త్వరగా కార్డులు మంజూరు చేయాలనీ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరగా సానుకూలంగా స్పందించారు.

జిల్లాలో ఇప్పటి వరకూ 309 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశామని Dpro దశరథం తెలిపారు.

సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ మెంబర్ సెక్రెటరీ,డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, కమిటీ సభ్యులు సయ్యద్ లాయక్ పాషా, మహమ్మద్ యూసుబ్, రాపెల్లి సంతోష్ కుమార్, కాంభోజ ముత్తయ్య, రాచర్ల లక్ష్మీ నారాయణ, గంగు సతీష్ , కనుకుంట్ల సతీష్ కుమార్ లు పాల్గొన్నారు.

——————————

Share This Post