జోగులాంబ గద్వాల్ జిల్లా.
జిల్లాలోని చేనేత వీవర్స్ తయారు చేసిన వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ లో ఎగుమతి చేసేందుకు జిల్లా అధికారులు సమిష్టిగా కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు స్వాతంత్ర్యం వచ్చి 75 సం.రాలు పూర్తి అయినందున జిల్లా వాణిజ్య ఉస్తవ్ సమావేశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిండి. మత్స్యకారులు, చేనేత కార్మికులు , మిల్లర్లు చేసే వ్యాపారాలకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించాలని అధికారులను కోరారు. వారు చేసే ఎగుమతుల పై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఇక్కడ తయారు చేసిన వస్తువులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు అవకాశాలు కల్పించాలని అన్నారు. జిల్లా లో ఏ మేమి వనరులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి వస్తువులకు డిమాండ్ వుంటుంది, కొత్తగా వ్యాపారంలో చేరే వారు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, నిబంధనలు ఏ విధంగా ఉంటాయి పూర్తి వివరాలు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. మిషన రి డెవలప్ చేస్తే ఎక్స్పోర్ట్స్ ,చేయడానికి వీలు కలుగుతుందని, పలువురు వ్యాపారస్తులు వారి అభిప్రాయం తెలిపారు.
చేనేత చీరలకు , చేపల వ్యాపారానికి గద్వాల్ జిల్లా పెట్టింది పేరు అని, టెక్నోలజి, లేటెస్ట్ డిజైన్ మార్కెటింగ్ సపోర్ట్ చేయుటకు సహకారామందిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసి వ్యాపారం చేసేందుకు మంచి అవకాశమని, మంచి శిక్షణ, సలహాలు సూచనలు చేయడానికి ప్రభుత్వం అంతర్జాతీయ వ్యాపార రంగంలోఅభివృది చేయుటకు అధికారులు, సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ సమావేశం లో లో హైదరాబాద్ నుండి ఏ డి ఎంఎస్ఎంఇ శ్రీధర్, డి ఆర్ డి ఓ ఉమాదేవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఏ డి హ్యాండ్ లూమ్స్ గోవిందయ్య, మత్య్స శాఖ అధికారి రిపెందర్ సింగ్ , ఎల్ డి ఎం సురేష్ చేనేత కార్మికులు, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.