జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలలో మల వ్యర్థాలను ఎరువులుగా తయారు చేయడానికి చేపట్టిన ఫ్రీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మాణ పనులను జనవరి మాసాంతం వరకు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా. కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ చాంబర్ నందు మున్సిపల్ కమిషనర్లు, హాస్కీ అధికారులతో మానవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతతోనే ఆరోగ్యమని, చెత్త నుండి సంపదను సృష్టించడమే లక్ష్యంగా ప్లీకల్ సైడ్ ట్రీట్మెంట్ శుద్దీకరణ ప్లాంటు నిర్మాణ పనులను చేపట్టినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మానవ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి ఎరువుగా వినియోగించేందుకు ఈ ప్లాంటు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. స్వచ్ఛ భారత్లో భాగంగా కొన్ని సంవత్సరాల క్రింత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రతి మూడు సంవత్సరాల కొకసారి వ్యర్థాలను తీసేసి శాస్త్రీయంగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని, అయితే అందుకు సంబంధించిన కేంద్రాలు ఇప్పటి వరకు అమలు నోచుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అనేక మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీలలో ఇటువంటి శుద్దీకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలలో ఈ కేంద్రాలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మున్సిపాల్టీతో పాటు చుట్టు ప్రక్కల పంచాయతీ కార్యాలయం పరిధిలోని సెప్టెక్ట్యాంకులు క్లీనింగ్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చునని చెప్పారు. తద్వారా నీటి కాలుష్యం  కూడా నివారించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన వివరించారు. పట్టణ పరిధిలోని గృహాల నుండి సేకరించిన వ్యర్ధాలను ఫ్రీకల్ స్టెడ్ ట్రీట్ మెంట్ ప్లాంటుకు తరలించి అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టరుతో మెథనైజేషన్ పద్ధతిలో శు డ్డి చేసి ఎరువుగా మార్చనున్న చెప్పారు. ప్లాంటు నిర్మాణ పనులను జనవరి మాసాంతం వరకు పూర్తి చేయాలని చెప్పారు. ఇలా తయారైన ఎరువులు పంట పొలాలలకు, నర్సరీలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్, అంజయ్య, నాగప్రసాద్, హస్కీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post