జిల్లాలోని నిరుద్యోగ యువతకు   ప్రముఖ ప్రైవేట్  కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో  మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

  సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు  మెగా జాబ్ నిర్వహణపై ఉపాధి,  విద్యుత్తు, డిఆర్డీఏ, మున్సిపల్, వైద్య, డిపివోలతో సమీక్షా సమావేశం నిర్వహించి జాబ్ మేళా గోడ పత్రికను  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 36  కంపెనీలు జాబ్ మేళా కార్యక్రమాన్ని హాజరవుతున్నట్లు చెప్పారు.  ఎనిమిది, పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, పీజీ, సీఏ,   ఇంజనీరింగ్,  ఎంబీఏ,  ఎంసీఏ,  ఐ టి ఐ ఎలక్ట్రికల్, ఫిట్టర్,  డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, సివిల్, కార్పెన్టర్ శిక్షణ పొందిన వారికి ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందని ఆయన చెప్పారు.  నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున లోటు పాట్లు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేయాలని ఉపాధి కల్పన అధికారికి సూచించారు. పైన పేర్కొన్న విద్యార్హతలు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయో డేటాతో పాటు విద్యార్హతల జిరాక్స్ ప్రతులను వెంట తెచ్చుకోవాలని చెప్పారు.  5 వేల నుంచి 8 వేల వరకు ఉద్యోగ అవకాశాలు న్నాయని ఈ సడవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.  ప్రతి నెల పోస్టును బట్టి 12 నుంచి 45 వేల రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉందని ఆయన సూచించారు. జాబ్ మేళాకు  మంచి మంచి పేరు గాంచిన కంపనిలు మన యువతకు ఉద్యోగ అవకాశం కల్పనకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యేందుకు గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీలలో టామ్ టామ్ లు వేయించాలని చెప్పారు.  డిగ్రీ, పాలి టెక్నిక్, ఇంజినీరింగ్, పీజీ కళాశాలల అధ్యాపకులు యువతకు ఇట్టి

సమాచారం తెలియచేయడంతో పాటు అధికసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.   వైద్య ఆరోగ్య శాఖ  ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని,  మున్సిపల్ అధికారులు మైదానంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణతో పాటు సురక్షిత మంచినీరు,  విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు.   విద్యుత్తు ఏర్పాట్లను విద్యుత్ అధికారులు పరిశీలన చేయాలని సూచించారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  వెంకటేశ్వర్లు,  ఉపాధి కల్పనాధికారి విజేత, డీపీఓ రమాకాంత్, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, వైద్యాధికారి డా శిరీష, విద్యుత్ ఎస్ ఈ సురేందర్ ఇతర శాఖల  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post