జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమలతో ఎం ఓ యు (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) పొంది నైపుణ్య శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ కు సూచించారు.

 

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమలతో ఎం ఓ యు (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) పొంది నైపుణ్య శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ కు సూచించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాజర్షి అధ్యక్షతన జిల్లా ఉన్నత విద్యాశాఖ అభివృద్ధి మరియు రివ్యూ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లాలో గల (7) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలను, కావలసిన సౌకర్యాలను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ రాజర్షి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పరిశ్రమలతో టై అప్ చేసుకుని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేలా చూడాలన్నారు. అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రహారి గోడ నిర్మాణానికి కావలసిన నిధులకు రీ ఎస్టిమేషన్ నివేదికను ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా అన్ని కళాశాలలకు సెక్యూరిటీ కోసం స్థానిక వ్యక్తులను గుర్తించి వాచ్ మెన్ ను నియమించుకోవాలని సూచించారు.

తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోలార్ ప్యానల్ ను,50 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ జి ఎం కు సూచించారు.

కళాశాలల స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా బౌండరీలను ఫిక్స్ చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి కళాశాలలో ఎకో క్లబ్స్
భాగస్వామ్యం తో పచ్చదనం పెంచాలన్నారు.
విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేలా విద్యా బోధన జరగాలని, అన్ని సౌకర్యాలు కల్పించడానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు.

డ్రాపౌట్స్ లేకుండా దృష్టి సారించాలన్నారు. ఆయా కళాశాలల్లో ప్రతి విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మళ్లీ పీజీ కొరకు రావాలన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన విపణి కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో తార ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఎం. ప్రవీణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉపాధి, పరిశ్రమల శాఖల అధికారులు, జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, టీఎస్ ఆర్ టి సి ప్రతినిది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post