జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలపై సమీక్ష సమావేశం

నల్గొండ,సెప్టెంబర్ 30.జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
 గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లాస్థాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రగతిపై  సమీక్ష సమావేశం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పై ప్రగతి , మౌలిక వసతులు, సమస్యలపై, ప్రత్యేక సమావేశం సమావేశంలో వివిధ కళాశాలలకు కావలసిన మౌలికవసతుల పై వివరాలను తెలుసుకొని, త్వరలోనే కావలసిన వసతులను సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం జరిగింది.  ఈ సమావేశంలో కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ నుండి డాక్టర్ గన్ శ్యామ్  అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్, నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కే చంద్రశేఖర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నామిని ప్రశాంతి , ప్రభుత్వ మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాపోలు శ్రీనివాస్, ఎం కె ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవరకొండ ప్రిన్సిపల్ రామరాజు, కే ఎం ఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ  రుక్సానా, డిగ్రీ కళాశాల నకిరేకల్  ప్రిన్సిపల్ కే చంద్రశేఖర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల చండూరు ప్రిన్సిపల్ నరసింహ, ప్రిన్సిపల్
రవికుమార్- గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హాలియా, వైస్ ప్రిన్సిపల్ మునీర్, అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ సుబ్బారావు, టి ఎస్ కే సి కోఆర్డినేటర్ ఎం నవీన్, యుజిసి కోఆర్డినేటర్ డాక్టర్ బాలస్వామి, లైబ్రేరియన్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post