జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ , జూనియర్ కళాశాలలో పెండింగ్ లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ధరకాస్తులను క్లియర్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                        తేది 12-08-2021

   జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ , జూనియర్ కళాశాలలో పెండింగ్ లో ఉన్న పోస్ట్ మెట్రిక్  స్కాలర్ షిప్ ధరకాస్తులను క్లియర్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా  అధికారులకు ఆదేశించారు.

        గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఎస్సి,ఎస్టి, బి.సి, మైనారిటీ సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాల్స్ తో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో ఉన్న 54 కళాశాలలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం వచ్చిన ధరకాస్తులను వెరిఫై చేసి ఆధార్ ఆతేంటిఫికేషన్ చేయాలనీ అన్నారు. ధరకాస్తులను పూర్తి చేస్తే కళాశాల కు మరియు విద్యార్థులకు బెనిఫిట్స్ వస్తాయని తెలిపారు. 2017-18, 2018-19, 19-20, 20-21, విద్యా సంవత్సరానికి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లకు  సంబంధించిన ధరకాస్తులను ఈ నెల 17 వరకు పూర్తి చేయాలనీ , విద్యార్థుల ఫోన్ నెంబర్ , ఇంటి అడ్రస్, పూర్తి సమాచారం తీసుకొని సంబంధిత అధికారులకు అందజేయాలని అన్నారు. కళాశాలల  వారిగా  పెండింగ్ లో ఉన్న దరకాస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

        సమావేశం లో డి.ఎస్.డి.ఓ శ్వేత, మైనారిటీ వెల్ఫేర్ అధికారి  ప్రసాద్ రావు,  బి.సి సంక్షేమ అధికారి కేశవులు, నోడల్ అధికారి హృదయ రాజు, పవన్, కళాశాలల  ప్రిన్సిపాల్స్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post