జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించడానికి జిల్లా బాల రక్షక వాహనాన్ని ప్రారంబించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

పత్రికా ప్రకటన                                                       తేదీ:03-01-2022

 

జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించడానికి జిల్లా బాల రక్షక వాహనాన్ని ప్రారంబించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

సోమవారం జిల్లా  కలెక్టరేట్ ఆవరణలో శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి  ప్రారంభించారు. ఈ వాహనం ఆపదలో ఉన్న పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున వాహనాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా  ఆపద లో ఉన్న పిల్లల సమాచారాన్ని 1098 టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు వెళ్లి  పిల్లలను  వాహనంలో తీసుకుని వచ్చి,  వారి రక్షణ, సంరక్షణ చూసుకుంటారని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మరియు జిల్లా సంక్షేమ అధికారిని  ముషాహిదా బేగం ,బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ హేమలత, డి సి పి ఓ నరసింహ ,సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ సహదేవుడు ,డబ్ల్యూ సి మెంబర్స్ జయ భారతి , శైలజ , భాస్కర్, రవి, సురేష్, నవీన్ ,లక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.

 

 

———————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

Share This Post