జిల్లాలోని భారీ, మధ్య మరియు చిన్న నీటి వనరుల కింద యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు నీటి విడుదల కోసం ప్లాన్ అఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లాలోని భారీ, మధ్య మరియు చిన్న నీటి వనరుల కింద యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు నీటి విడుదల కోసం ప్లాన్ అఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నారాయణఖేడ్, అందోల్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి , చంటి క్రాంతి కిరణ్ ల ఆధ్వర్యంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో యాసంగి లో భారీ, మీడియం మరియు చిన్న నీటి ట్యాంకుల పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదల పై శాసన సభ్యులు పలు సూచనలు సలహాలు చేశారు.

జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలు, నల్లవాగు ప్రాజెక్టు కింద 5,100 ఎకరాలు, 15 చెరువుల కింద 5,100 ఎకరాల ఆయకట్టుకు ఆన్ ఆఫ్ సిస్టం ద్వారా షెడ్యూల్ మేరకు ఆరుతడి పంటల సాగుకు మాత్రమే నీటిని విడుదల చేయాలని అడ్వైజరీ బోర్డు నిర్ణయించింది.

ప్రతి చెరువు కింద ఆయకట్టు రైతులతో నీటిపారుదల, వ్యవసాయ, రెవిన్యూ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ నెల 27 నుండి 30 వరకు
తై బందీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా రైతులకు యాసంగి లో వరి పంట లేదని, భారత ఆహార సంస్థ కొనుగోలు చేయమని చెప్పినందున, ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించాలన్నారు. చెరువులు, కాలువల కింద ప్రతిపాదించిన ఆయకట్టు లో వేసుకోవాల్సిన ఆరుతడి పంటల గురించి రైతులకు సూచించాలన్నారు. సంబంధిత విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆయా ఆరుతడి పంటల సాగుకు షెడ్యూల్ మేరకు ఆన్ ఆఫ్ సిస్టంలో నీటిని వదలాలని తెలిపారు.

ఆయా ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల కింద ఆయకట్టులో ఏ పంటలు వేశారు, ఏ పంటలు వేయబోతున్నారు అన్న వివరాలను వ్యవసాయ అధికారులు తెలుసుకుని తగిన సలహాలు సూచనలు ఇస్తూ రైతులు వరి వేసి నష్టపోకుండా చూడాలన్నారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సహించడంలో వ్యవసాయ అధికారులు కీలక పాత్ర వహించాలన్నారు.

నీటిని రెగ్యులేట్ చేయాలని, సింగూరు ,నల్లవాగు ఇతర ట్యాంక్ ల మరమ్మత్తులు, మేజర్ వర్క్స్ ఏవైనా ఉంటే ఆన్,ఆఫ్ సీజన్లోనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వరి పంటకు నీళ్లు ఇవ్వలేమని, ఆరుతడి పంటలు వేసుకోవాలని, వాటికి మాత్రమే ఆన్ ఆఫ్ సిస్టం లో షెడ్యూల్ ప్రకారం నీటిని వదులుతామని రైతులకు తెలియజేయాలన్నారు. మన జిల్లాకు అవసరమైన కూరగాయలు, పప్పు ధాన్యాలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ ఈ మురళీధర్, ఈఈ లు మధుసూదన్ రెడ్డి, జై భీమ్, విజయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ ఇ ఇలు, ఏ ఈ లు, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, నారాయణఖేడ్ ఆర్ డి ఓ అంబ దాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post