జిల్లాలోని వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన  వక్ఫ్ భూముల పరిరక్షణ సమన్వయ కమిటీ సమావేశంలో  ఆమె మాట్లాడుతూ,  జిల్లాలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని,  ఆక్రమణదారుల పట్ల క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.  జిల్లాలోని వక్ఫ్  భూములను గుర్తించి స్వాధీనపరచుకోవాలని, సర్వే చేపట్టాలని, రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్  సంస్థల పేర్లను పునరుద్ధీకరించాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, వక్ఫ్ భూములలో ప్రైవేటు కట్టడాలకు అనుమతి నిరాకరించాలని తెలిపారు. వక్ఫ్ బోర్డు భూములు, ఆస్తుల ముందు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా మైనార్టీ అధికారికి సూచించారు. భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీలో సమీక్షించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అధికారి డి. శ్రీనివాస రెడ్డి,ళ భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఎ.సి.పి. వెంకట్ రెడ్డి,  జిల్లా మైనార్టీ అధికారి సత్యనారాయణ,  సర్వే ల్యాండ్ రికార్డు ఏడి మధుసూదన్,  సబ్ రిజిస్టార్, మున్సిపల్ అధికారులు, కమిటీ సభ్యులు ఎండి అఫ్జల్,  ఇంతియాజ్, ఇస్రత్ జహా, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

Share This Post