జిల్లాలోని “వరం” రైతు ఉత్పత్తిదారు పరస్పర సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ సంఘంగా నిలపాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

జిల్లాలోని “వరం” రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ సంఘంగా నిలపాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వరం ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు సంవత్సరాల క్రితం
రాయికోడ్,వట్ పల్లి, మునిపల్లి మండలాల రైతులతో రైతు ఉత్పత్తి దారుల సంఘం “వరం” పేరుతో ఏర్పడిందన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఉత్పత్తులను తామే నేరుగా అమ్ముకోవడానికి ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలలో స్టాల్స్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.

రైతు పండించిన పంటలు మధ్య దళారుల చేతుల్లో కి వెళ్లి సరైన ధర రావడంలేదని ,వారు లాభాలు గడిస్తున్న రైతులకు నామమాత్రంగా పెట్టుబడి మాత్రమే లభిస్తుందన్నారు.

రైతులే ప్రత్యక్షంగా కొనుగోలు దారుల సంఘం ఏర్పాటు చేసుకుని, ఇలా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కలెక్టరేట్లో ఏర్పాటు చేశారని త్వరలో ఈ విక్రయ కేంద్రాలను హైదరాబాదు లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడ జనసమ్మర్థం ఉంటుందో అక్కడ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ గా ప్రత్యేక అనుమతులు జారీ చేస్తామని తెలిపారు.

సంఘం బాగా లాభాలు
ఘడిస్తే సంఘం లోని ప్రతి సభ్యుడు లబ్ధి పొందుతాడన్నారు. వరం వినూత్న పోకడలతో ముందుకు వెళుతుందని, పత్తి సేకరణ, అమ్మకాలు, విత్తన కొనుగోలు దగ్గర నుండి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా ఉంటుందన్నారు.

రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ” వరం “కు రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు కందిపప్పు మిల్లు మంజూరు చేశారని, మిల్లు ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని కేటాయించామన్నారు. త్వరలోనే పప్పు మిల్లును ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అట్టి మిల్లు ద్వారా వారే పప్పును తయారుచేసి నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే వరం ఒక ప్రత్యేక వ్యవస్థగా రూపొందుతుందని ఆయన ఆకాంక్షించారు.

ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వరం ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ
వరము సంస్థ ద్వారా రైతులకు అతి తక్కువ ధరకే అన్ని రకాల విత్తనాలను,మందు సంచులను,కాలానికి అనుగుణంగా తాటిపత్రిలు,మరియు పండించిన పంట ను మద్దతు ధరకు అమ్ముకునే విధంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
10 క్వింటాళ్ల పప్పు చేసి కేజీ పప్పు ను 99 రూపాయలకు విక్రయించడానికి సంఘం నిర్ణయించిందన్నారు.

అనంతరం మొదటి కొనుగోలుదారు గా జిల్లా కలెక్టర్ వారి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అనంతరం కలెక్టర్ వీరారెడ్డి కొనుగోలు చేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జె.డి నర్సింహరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి హరిత ,చైర్మన్ వీరా రెడ్డి ,ప్రధాన బోర్డ్ సభ్యులు ఆనంద్, నరేష్ ,DAO కార్యాలయ సిబ్బంది,వరము సంస్థ సిబ్బంది, ఆత్మ సిబ్బంది శ్రీనివాస్,మాలతీ రమేష్ లు పాల్గొన్నారు..

Share This Post