జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధీనంలో గల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టి సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు,01,ఖమ్మం:

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధీనంలో గల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టి సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన “గ్రీవెన్స్ డే” సందర్భంగా జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి సత్వర పరిష్కారానికై సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, పరిష్కృతి కేసులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చర్యలు, సమాచార హక్కు చట్టం సమగ్రసమాచారం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి పెండింగ్ కేసుల సత్వర పరిష్కార చర్యలకై జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధీనంలో గల ప్రభుత్వ ఆస్తులైన కార్యాలయ భవనాలు, ఖాళీ ప్రదేశాలు, వసతి గృహాలు, వైద్యశాలలు తదితర సమగ్ర సమాచారాన్ని రికార్డుల ప్రకారం సరిచూసుకొని అవసరమైన యెడల ఆధునీకరించుకోవాలని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిర్దేశిత పట్టికలో పొందుపర్చి మూడు రోజులలోపు సమర్పించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా సమాచార హక్కుచట్టంకు సంబంధించి పౌరులకు అందుబాటులో ఉంచవలసిన ఆయా శాఖల పూర్తి సమాచార నివేదికలను కూడా సమర్పించి ఆయా శాఖాధిపతులు కార్యాలయంలో పౌరులకు సులువుగా అర్ధమయ్యే రీతిలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. “”గ్రీవెన్స్ డే” సందర్భంగా జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు అధికంగా భూ సమస్య పరిష్కారానికి తమ అర్జీలను కలెక్టరుకు సమర్పించారు. భూసమస్యలకు సంబంధించి మండల స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీల సత్వర పరిష్కార చర్యలకై విర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారుల పరిధిలో పరిష్కారమయ్యె అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏన్కూరు మండలం పైనంపల్లి తండా నుండి వచ్చిన ధరావత్ మల్లీశ్వరీ తాను గత సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత పొందానని తనకు ఇంటర్మీడియట్లో గురుకుల కళాశాలలో అడ్మిషన్ ఇప్పించగలరని సమర్పించిన అర్జీపై సత్వర చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ఆర్.సి.ఓ.ను కలెక్టర్ ఆదేశించారు. పెద్దగోపతి పి.హెచ్.సిలో కార్యాలయ సబార్డినేట్గా పనిచేస్తున్న పి.వి.సుబ్బారావు తనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ గా   మార్చగలరని సమర్పించిన అర్జీని పరిశీలన చేసి తగు చర్యగైకొనాలని జిల్లా వైద్య ఆరో శాఖాధికారికి సూచించారు. వైరా బి.సి కాలనీకు చెందిన ఎస్.కె. జానీబి వైరా ప్రభుత్వ వైద్యశాలలో గత 25 సంవత్సరాలుగా కంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్నానని, తన నెలసరి జీతం పెంచగలరని సమర్పించిన అర్జీపై తగు చర్యకై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. కామేపల్లి మండలం రామకృష్ణాపురం నుండి వచ్చిన పి.సైదులు, తన సర్వే నెం.501/అలో గల భూమిలో 2 కుంట ల భూమి నమోదు కాలేదని అట్టి భూమిని నమోదు చేయగలరని. సమర్పించిన అర్జీని తగు చర్యకై రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచించారు. పెనుబల్లి మండలం కొండ్రుపాడు నుండి వచ్చిన యం. వెంకటేశ్వరరావు సర్వేనెం. 364 భూమికి పట్టా రాలేదని, జారీ చేయగలరని సమర్పించిన అర్జీని పరిశీలన చేసి తగు చర్య గైకొనాలని పెనుబల్లి తహశీల్దారును. ఆదేశించారు. ఎర్రుపాలెం గ్రామంలో గ్రామపంచాయితీ రోడ్డు ఆక్రమించి ఇంటి నిర్మాణం జరుగుచున్నదని, తగు చర్య తీసుకొనగలరని గ్రామ ప్రజలు సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి తగు చర్యగైకొనాలని జిల్లా పంచాయితీ అధికారికి సూచించారు. కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో గల తన భూమికి డిజిటల్ పాస్ బుక్ ఇప్పించగలరని కర్రీ పద్మావతి సమర్పించిన అర్జీపై తగు చర్యకై తహశీల్దారును ఆదేశించారు. నగరంలోని శుక్రవారిపేట, బుర్హనప్పరంకు చెందిన ఎస్. షబానా, కె. పద్మ తమకు డబుల్ బెడ్రూమ్ గృహాలు ఇప్పించగలరని సమర్పించిన అర్జీలను తదుపరి చర్యకై అర్బన్ తహశీల్దారును ఆదేశించారు. కల్లూరు నుండి వచ్చిన ఎస్. గఫార్ అంథ వికలాంగుడు తనకు ఏదైనా జీవనోపాధి కల్పించగలరని సమర్పించిన అర్జీను తదుపరి చర్యకై జిల్లా సంక్షేమ శాఖాధికారికి సూచించారు. పెనుబల్లి మండలం లింగగూడెం గిరిజనులు తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తమకు తిరిగి భూమి ఇప్పించి జీవనోపాధి చూపగలరని సమర్పించిన అర్జీని పరిశీలన చేసి తగు చర్య తీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం జాతీయ రహదారిగా మారుతుందని, మండల పరిధిలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందని ఫోరైన్ బ్రిడ్జి ఏర్పాటు చేయగలరని ఏదులాపురం గ్రామ ప్రజలు సమర్పించిన అర్జీని సుదా అధికారులకు తదుపరి చర్యకై సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు “గ్రీవెన్స్ డే”లో పాల్గొన్నారు.

Share This Post