జిల్లాలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాల గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక జిల్లా – ఒక హరిత విజేతలో భాగంగా.జిల్లాలోని వివేకవర్ధిని డిగ్రీ & పి.జి. కళాశాల గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలోని కలెక్టర్‌ చాంబర్‌లో ఈ అవార్డును కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాన్‌, జిల్లా ఎన్‌.ఎస్.ఎస్. కన్వీనర్‌ డా. చంద్రమోహన్‌గౌడ్‌ ఊదారి లకు అందజేశారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కళాశాల ఆధ్వర్యంలో పచ్చదనం పెంపు – పర్యావరణ పరిరక్షణ, పరిశుభత నిర్వహణ అంశంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు దక్కిందని, దేశ వ్యాప్తంగా న్వచ్చత నంబంధిత అంశాలపై నిర్వహించిన కార్యక్రమానికి 1200 నామినేషన్స్‌ రాగా అందులో 300 నామినేషన్స్‌ గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డుకి ఎంపిక కావడం జరిగిందని, అందులో వివేకవర్ధిని డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ద్వారా గత ౩ నంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాలకు ఈ అవార్డు లభించిందని తెలిపారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటి వాటి నంరక్షణ బాధ్యతలను చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాలలో ప్రజా ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలను, పరిశుభత యొక్క ఆవ్యశ్యకతను, త్రాగు నీటి నంరక్షణకు చేపట్టవలనిన చర్యల గురించి అవగాహన కల్పించారని తెలిపారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి, హైదరాబాద్‌ అధికారులు నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ శిరీష ప్రసాద్‌, పద్మ, కళాశాల ప్రోగ్రాము అధికారి బి.రమేవ్‌, జిల్లాలోని, వివిధ కళాశాలల ప్రోగ్రామ్‌ అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post