జిల్లాలోని షెడ్యూల్డ్ కులముల వసతి గృహ అధికారులు తప్పనిసరిగా స్థానికంగా ఉండి విద్యార్థుల పర్యవేక్షణ చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

జిల్లాలోని షెడ్యూల్డ్ కులముల వసతి గృహ అధికారులు తప్పనిసరిగా స్థానికంగా ఉండి విద్యార్థుల పర్యవేక్షణ చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు షెడ్యూల్డ్ కులముల వసతి గృహ అధికారులుతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల హాజరు కు సంబంధించి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఉండాలని, 10 వ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయాల్లో  ట్యుషన్లు  నిర్వహించి  ఉత్తిర్ణత శాతం పెంచేలా చూడాలని, విద్యార్థులకు సంబంధించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు ఆలస్యం కాకుండా  సమయానికి విద్యార్థులకు అందేలా వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. సి.డబ్లు.ఎఫ్  (crucial Welfare Fund)  పనుల పై పర్యవేక్షణ చేయాలనీ , వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

సమావేశం లో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని, సహాయ సంక్షేమ అధికారి సరోజ, వసతి గృహ అధికారులు, తదితరులు , పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  జిల్లా గారిచే జారీ చేయనైనది.

 

Share This Post