జిల్లాలోని స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్స్ అన్నింటికీ బయో ఫెన్సింగ్ చేసి మొక్కలు నాటాలి …… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

స్మశాన వాటికలకు బయో ఫెన్సింగ్ చేయాలి…

మహబూబాబాద్ జూలై 20:

జిల్లాలోని స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్స్ అన్నింటికీ బయో ఫెన్సింగ్ చేసి మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో హరితహారం పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మశాన వాటిక లలోనూ సెగ్రిగేషన్ షెడ్స్ లలోను బయో ఫెన్సింగ్ తో మొక్కలు నాటాలని తెలిపారు.

ప్రతి స్మశానవాటికలో 400కు పైగా మొక్కలు నాటాలి అన్నారు.

స్మశాన వాటిక చుట్టూ వెదురుతో ను ముళ్ళకంప తోనూ ఫెన్సింగ్ చేసిన గోరింట చెట్లను మూడు లేయర్స్ గా నాటాలని అన్నారు.

బయో ఫెన్సింగ్ వివరాలపై రోజువారి నివేదికలు అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి నీ కలెక్టర్ ఆదేశించారు.

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆయా ప్రాంతాలను సందర్శించాలని ఫిట్టింగ్ ప్లాంటింగ్ కొరకు కావలసిన కూలీల సంఖ్య నిర్ధారించుకోవాలి అన్నారు పెద్దవంగర తొర్రూరు పల్లె ప్రగతి లో వెనుక బడి ఉన్నట్లు తెలియజేస్తూ ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి చర్యలు తీసుకోవాలన్నారు రు మండలాలలో 10 ఎకరాలు మెగా హరితహారం కు సేకరించాలని అలాగే ప్రతి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు అదేవిధంగా గ్రామపంచాయతీ రికార్డ్స్ తనిఖీ చేయా లన్నారు హరితహారం లక్ష్యం ఏడో విడత లో తక్కువగా ఉన్నందున నాణ్యతతో చేపట్టాలని నాటిన ప్రతి మొక్కకు భద్రత చూడాలన్నారు పల్లె ప్రగతి లో పని చేసిన అధికారులను కలెక్టర్ ప్రశంసించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈఓ అప్పారావు, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post