జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు డ్రా పద్దతిలో లైసెన్సులు కేటాయింపు చేసినట్లు రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డా ఏ శరత్ తెలిపారు.

శనివారం చుంచుపల్లి. మండలంలోని కమ్మ వారి కళ్యాణ మండపంలో మద్యం 2021-23 రెండు సంవత్సరాలకు మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియకు ప్రత్యేక అధికారిగా విచ్చేసిన ఆయన 88 దుకాణాలకు వ్యాపారుల సమక్షంలో లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాకు 88 మద్యం దుకాణాలు కేటాయించగా మొత్తం  4271 దరఖాస్తులు రాగా  ఎక్స్ యిజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రా పద్దతిలో కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈయొక్క కేటాయింపుల పద్ధతి అంతా వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేశామని, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం  ఎంతో పారదర్శకంగా . టెండర్ దారుల సమక్షంలో లాటరీ నిర్వహించామని చెప్పారు.  అధికంగా దరఖాస్తులు రావడంతో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.  డ్రా లో దుకాణాలు పొందిన వారికి లైసెన్సు లు కేటాయింపులు చేపట్టారు. మొత్తం 88 మద్యం దుకాణాల్లో ఎస్టీలకు 44, ఎస్సి లకు 7, గౌడ్ లకు 6, ఇతరులకు 31 కేటాయించామన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా జరగడంలో ప్రతి ఒక్కరు సహకరించారని అందరిని అభినందించారు.

Share This Post