జిల్లాలో అక్రమ ఇసుక తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో అక్రమ ఇసుక తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో  మన ఇసుక వాహనం అమలు పై మైన్స్, పోలీస్, రెవిన్యూ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే టి.ఎస్.ఎం.డి.సి., మన ఇసుక వాహనం ద్వారా వినియోగదారులకు  ఇసుక అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  మన ఇసుకవాహనం వెబ్సైట్ లో వెళ్లి ఇసుక ఎంతకావలో నమోదు చేసుకుంటే తక్కువ ధరకే వినియోగదారుని ఇంటిముందు వేయడం జరుగుతుందన్నారు.  మన ఇసుకవాహనం ఆన్లైన్ లో కేవలం 170 ట్రాక్టర్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే తక్కువ ధరకె వస్తున్నప్పుడు ఇసుక ఎలా అక్రమంగా తరలిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మన ఇసుకవాహనం ద్వార ఇసుక సజావుగా వినియోగదారులకు అందడానికి  గుర్తించిన ఇసుక రీచుల   వద్ద ఎస్.ఆర్.ఓ లను నియమించడం జరిగిందన్నారు. అక్రమ ఇసుకను అరికట్టడానికి మండలంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్, తహసిల్దార్,  ఎస్.ఆర్.ఓ లు సమన్వయ సమావేశం ఏర్పాటుచేసుకొని కలిసికట్టుగా అక్రమార్కులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  త్వరలోనే జిల్లాలో మరికొన్ని కొత్త ఇసుక రీచులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసారు. గృహ నిర్మాణాలకు ఇసుక అవసరమైన వినియోగదారులు అందరూ మన ఇసుకవాహనం ఆన్లైన్ ద్వారానే  దరఖాస్తు చేసుకొని తక్కువ ధరకు ఇసుక పొందాలని, ఎవరు అక్రమార్కుల వద్ద ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేయవద్దని కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, గ్రౌండ్  వాటర్ అధికారిణి రమాదేవి, మైన్స్ అధికారి, డి.ఎస్పిలు, మోహన్ రెడ్డి, గిరిబాబు,  సి.ఐ లు పాల్గొన్నారు.

Share This Post