జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరిగా అమలు పర్చాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధ

నవంబరు, 15, ఖమ్మం:

జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరిగా అమలు పర్చాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో ఈ-ఆఫీస్ విధానం అమలుపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ-ఆఫీస్ విధానం వల్ల రికార్డులకు పూర్తి  భద్రత ఉంటుందని, సమయం ఆదా అవుతుందని, ఎటువంటి అవకతవకలు జరిగే ఆస్కారం ఉండదని, దీనితో పాటు జిల్లా అధికారులకు అనుకూలంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ-ఆఫీస్ విధానం ఆఫీస్ మాన్యువల్ ప్రకారంగానే ఉంటుందని, ఎటువంటి తప్పులు జరిగే ఆస్కారం ఉండదని, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ రూపంలో శాశ్వతంగా రికార్డులు ఉంటాయని, ఫైళ్ళ నిర్వహణ క్రమపద్ధతిన సక్రమంగా ఉంటుందని, జిల్లా అధికారులందరూ తమ కార్యాలయాలలో వచ్చే వారం నుంచి తప్పనిసరిగా ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు పర్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆఫీస్ నిర్వహణపై ఇప్పటికే అధికారులకు, సంబంధిత సిబ్బందికి శిక్షణ నివ్వడం జరిగిందని, ఇంకనూ శిక్షణ పొందని వారికి మరోమారు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు కార్యాలయంతో పాటు, జిల్లా కలెక్టర్/ స్థాయిలో నిర్వహించే ఫైళ్ళు అన్ని వచ్చే వారం నుండి ఈ-ఆఫీస్ పద్ధతినే జరగాలని, తదనుగుణంగా ఆయా కార్యాలయాలలో అధికారులు, సంబంధిత సిబ్బంది శిక్షణ పొంది, అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శ్రీరామ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా విద్యా శాఖాధికారి యదయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post