జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటిపారుదల శాఖలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారులు, అంతర్గత రహదారుల నిర్వహణ, నీటి పారుదల పైప్లైన్లు, సి.సి. రోడ్డు, ఇంజనీరింగ్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పూర్తి చేయడంతో పాటు గ్రామాల పరిధిలో మంజూరైన రోడ్ల నిర్మాణానికి కార్యచరణ రూపొందించి ప్రణాళిక ప్రకారంగా పనులు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులను పూర్తి స్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం 15-18 సం॥ల మధ్య పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని, విసృత ప్రచారం నిర్వహించి వయస్సు అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు-భవనాల శాఖ ఈ. ఈ. పెద్దయ్య, పంచాయతీరాజ్ అధికారి రామ్మోహన్రావు, డి.ఈ.లు, ఏ. ఈ.లు, గ్రామీణ నీటిపారుదల శాఖ ఈ. ఈ. వెంకటపతి, మిషన్ భగీరథ ఈ. ఈ. నాగేశ్వర్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.