జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్… నిఖిల

జిల్లాలో చేపట్టిన ఎన్ఆర్ఇజియస్, పియంఏవై పనులను పర్యవేక్షించేందుకు ఈనెల 15 న యన్. యల్. యం. టీమ్ సందర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేసినారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హరితహారం, రైతు బంధు తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఏపిఓలు, ఇసిలు, టిఏలు, గ్రామ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా, కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన ఎన్ఆర్ఇజియస్ మరియు పియంఏవై క్రింద చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకు ఈనెల 15న కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ నుండి ఇద్దరు సభ్యులతో కూడిన యన్.యల్. యం. టీమ్ రానున్నదని తెలియజేసినారు. ఈ సందర్బంగా జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన రిజిస్టర్లు, ఫైల్స్ సిద్ధం చేసుకొని అందుబాటులో ఉంచాలన్నారు. చేపట్టిన పనుల వద్ద వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ కార్యదర్శులు తమ తమ జిపి లలో జాబ్ కార్డులు అన్ని అప్ డేట్ చేసుకోవాలన్నారు. ఎన్ఆర్ఇజియస్ కూలీలకు సకాలంలో వారి డబ్బులు అందే విధంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి పోస్టల్ శాఖ ద్వారా అకౌంట్లు తెరుపించాలని, పోస్టల్ శాఖ అధికారులు నేరుగా గ్రామాలలోనే క్యాంపులు నిర్వహించి అకౌంట్లు తెరువనున్నట్లు గ్రామ కార్యదర్శులకు తెలిపారు. నాలుగు రోజులలో ప్రతి ఒక్కరికి ఖాతాలు తెరిపించి ఎప్పటికప్పుడు వారికి డబ్బులు అందేలా చూడాలన్నారు. జిల్లాలో దళిత బంధు పథకం క్రింద 358 మందిని ఎంపిక చేసి గ్రౌండింగ్ కమిటీల ద్వారా 441 రకాల యూనిట్లను గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. యూనిట్ల గుర్తింపు గ్రౌండింగ్ విషయంలో మండలాలలో మరియు మున్సిపల్ పరిధిలో అధికారులు ఫైలింగ్ వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. షాపుల అద్దె విషయంలో రెంటల్ అగ్రిమెంట్, జాయింట్ మండల వెరిఫికేషన్ పత్రాలను సేకరించాలని తెలిపారు. ఆ తర్వాత బ్యాంకుల ద్వారా చెక్కుల రూపంలో చెల్లింపులు జరగాలని, లబ్ధిదారులు ఒరిజినల్ బిల్లులు, రసీదులు దాఖలు చేసాలా ఎంపీడీఓలు చూసుకోని వెంటనే ఆన్-లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. దళిత బంధు లబ్ధిదారుల గోర్లు, మేకల షెడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా ఈసారి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అన్నారు. శుక్రవారం నుండి లక్ష్యం మేరకు గుంతలు పనులను చేపట్టాలన్నారు. హరితహారంలో నిర్లక్ష్యం తగదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డిఆర్ డిఓ కృష్ణన్, యస్సి కార్పొరేషన్ ఇడి బాబుమొజెస్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్ కుమార్, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డీపీవో మల్లారెడ్డి, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post