జిల్లాలో అమలు అవుతున్నకేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన వనపర్తి తేదీ:15.9.2021.

కేంద్ర ప్రభుత్వ పథకం కింద చేపట్టిన పనులను జాప్యం లేకుండా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో (మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా) జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రత్యేక బృందం సభ్యులు వనపర్తి, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లో చేపట్టిన 18 గ్రామా పంచాయతీలను ఎంపిక చేసి, పర్యవేక్షించడం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పథకాల క్రింద చేపట్టవలసిన పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు.
గ్రామాల, మండల, జిల్లాస్థాయి అధికారులు సహకారంతో పనులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆమె సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( MGNREGS), నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (NRLM), వాటర్ షెడ్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, జాతీయ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం, పీఎం కిసాన్ యోజన పథకం, రెవెన్యూ రికార్డుల డిజిట లీకరణ, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, లోకల్ బాడీ అంకిత్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ సురేష్, ఈ ఈ. పి ఆర్, డి డబ్ల్యూ, డి ఈ ఓ, ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏ పీ ఓ లు, సెర్ఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post