జిల్లాలో అయిల్ పామ్ సాగును మరింత విస్తరింపజేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

మే.05 ఖమ్మం:

జిల్లాలో అయిల్ పామ్ సాగును మరింత విస్తరింపజేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఉద్యానవన శాఖ అధికారులు, ఆయిల్‌పామ్ కంపెనీల బాధ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ చర్యలపై కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలంలో కనీసం ఐదు వందల ఎకరాలకు తగ్గకుండా ఆయిల్‌పామ్ సాగు జరగాలని, కనీసం ప్రతి మండలంలో వంద మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఆయిల్బమ్ సాగుపట్ల రైతులు మొగ్గుచూపుతున్నారని ఒకే ప్రాంతంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేవిధంగా సుమారు 11 వేల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగుకు సరిపడా మొక్కలను సకాలంలో రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా జిల్లాలో అయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను అవసరమైన స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయిల్‌పామ్ సాగు విస్తరించేందుకు గాను ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రైతుల వద్దకు వెళ్ళి ఆసక్తి కలిగిన రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. దీనితో పాటు అయిల్‌పామ్ సాగుకు రైతులకు అవసరమైన డ్రిప్ ల మంజూరుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని 2021-22 సంవత్సరానికి మంజూరైన లక్ష్యాలను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న అవకాశాలు, సదుపాయాల పట్ల అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా ఉద్యానవన శాఖఅధికారి అనసూయ, జిల్లా వ్యవసాయ శాఖ ఇంచార్జ్ అధికారి సరిత, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, ఆయిల్ఫైడ్, గోద్రేజ్ కంపెనీల బాధ్యులు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post