జిల్లాలో అర్బన్  డెవలప్ మెంట్ను మరింత విస్తరింప చేసేందుకు ల్యాండ్ పూలింగ్ ద్వారా అర్బన్  డెవలప్ మెంట్ ప్రణాళిక ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 13 ఖమ్మం:

జిల్లాలో అర్బన్  డెవలప్ మెంట్ను మరింత విస్తరింప చేసేందుకు ల్యాండ్ పూలింగ్ ద్వారా అర్బన్  డెవలప్ మెంట్ ప్రణాళిక ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ తో పాటు మున్సిపల్, పట్టణ ప్రాంతాల తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపట్ల చర్చించి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియలో భాగంగా ఖమ్మం జిల్లాలో అర్బన్ డెవలప్మెంట్ను విస్తరింప చేసేందుకు జిల్లాలో లేఅవుట్కు అనువైన అసైన్డ్ భూములు, ప్రభుత్వ, పట్టా భూములను గుర్తించి ప్రతిపాదనలను సమర్పించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. రైతులు, ఇతర భూయజమానుల నుండి అసైన్డ్ పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా లే అవుట్ ప్రభుత్వ పరంగా చేయడం వల్ల భూముల విలువలు పెరుగుతాయని, తద్వారా సంబంధిత రైతులు, యజమానులకు ఆర్థిక లాభం చేకూరుతుందన్న విషయాన్ని తెలిపి అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ వల్ల చేపట్టే లేఅవుట్ల ద్వారా ప్రభుత్వ అనుమతులు త్వరగా లభిస్తాయని, పట్టాదారు వెంచర్గా మారుతారనే విషయాన్ని తెలియజేసి స్వచ్ఛందంగా ముందుకువచ్చే విధంగా చైతన్యపర్చాలని కలెక్టర్ సూచించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరుగుతుందని, జిల్లాలో కనీసం 2 వేల ఎకరాల లక్ష్యంతో ప్రతి మండలంలో 250 ఎకరాల భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఖమ్మం-సూర్యపేట, ఖమ్మం- విజయవాడ, ఖమ్మం-కోదాడ జాతీయ రహదారులుగా విస్తరిస్తున్నాయని, ప్రధానంగా ప్రధాన రహదారుల వెంట ఉన్న భూముల ఎంపికకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ సూచించారు. ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల భూముల విలువ పెరగడంతో పాటు ప్రభుత్వ పరంగా చేపట్టబడే లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం ద్వారా ప్రజా అవసరాల కనుగుణంగా మౌళిక వసతుల కల్పన జరుగుతుందని తద్వారా అర్బన్  డెవలప్ మెంట్  మరింత విస్తరిస్తుందని కలెక్టర్ తెలిపారు.

నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూధన్, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏ.డి రాము, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, సత్తుపల్లి తహశీల్దార్లు, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post