జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠ దామాల నిర్మాణపు పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ నిఖిల.

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠ దామాల నిర్మాణపు పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో వైకుంఠ దామాల అసంపూర్తి నిర్మాణపు పనులు,వాటి చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,వైకుంఠ దామాలలో మిగిలివున్న నీటి సదుపాయం,మరుగుదొడ్ల, కలరింగ్ లాంటి చిన్న చిన్న పనులన్నింటిని వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి అయిన పనులకు చెల్లింపులకు సంబందించి FTO లను వెంటనే ఆన్ – లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో వైకుంఠదామాల పరిశీలనకు వచ్చినప్పుడు నిర్మాణపు పనులలో ఎలాంటి లోటు పాట్లు కనపించకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య,PR EE శ్రీనివాస్ రెడ్డి ,డీఈ లు,ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post