జిల్లాలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల..

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల R&B అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జాతీయ రహదారుల అసంపూర్తి నిర్మాణపు పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన్నెగూడ నుండి రావులపల్లి వరకు గల నేషనల్ హైవే – 163 రోడ్డు పనులలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకొని వెంటనే పూర్తి చేయాలన్నారు. ధార్మిక కట్టడాల విషయమై వివిధ కుల సంఘాల పెద్దలతో చర్చించి సమస్యలను అధిగమిచాలని సూచించారు. రెవిన్యూ అధికారుల సహకారంతో రోడ్డు మార్గములో ఉన్న అక్రమనలను కూడా తొలగించి పనులను పూర్తి చేయాలని R&B ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పరిగి మండలంలోని నజీరాబాద్ వద్ద, బొంరాస్ పేట వద్ద గల తునికిమెట్ల వద్ద పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. తాండూర్ డివిజన్లోని మహబూబ్ నగర్ నుండి చించొలి వరకు గల నేషనల్ హైవే -167 రోడ్డు పనులను కూడా వెంటనే ప్రారంభించాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, R&B NH హైదరాబాద్ డివిజన్ EE ధర్మారెడ్డి, వికారాబాద్ R&B EE లాల్ సింగ్, వికారాబాద్ /తాండూర్ RDO లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post