జిల్లాలో ఆగష్టు నెలాఖరు నాటికి అన్ని బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 13 ఖమ్మం

జిల్లాలో ఆగష్టు నెలాఖరు నాటికి అన్ని బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓ.లు, డివిజనల్ పంచాయితీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పల్లె ప్రగతి పనులు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, అనాథరైజ్డ్ లే అవుట్లపై తీసుకున్న చర్యలు, నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మండలాలవారీగా సమీక్షించి పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ఈ నెలాఖరులోగా పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో పూర్తి స్థాయిలో మొక్కలను నాటి పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో నిండుగా ఉండాలని, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని, విశాలమైన విస్తీర్ణం కలిగిన చోట ఓపెన్ జిమ్, పిల్లల ఆటవిడుపు పరికరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. దీనితో పాటు ఆయా మండలాల పరిధిలో గల ఆన్అథరైజ్డ్ లే అవుట్లపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అనాథరైజ్డ్ లేఅవుట్లలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ప్లాట్ల విక్రయాలు ఈ. సిలను పరిశీలించి ఇంకనూ   అన్ ఆథరైజ్డ్ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సబ్ రిజిస్ట్రార్ సమన్వయంతో సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఇంకనూ ప్రయివేటు స్థలాల్లో ఉన్న నర్సరీలను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాలకు తరలించాలని, నీటి వసతులు, ఫెన్సింగ్ సర్సరీలకు అనువైన ఇతర సదుపాయాలను సరిచూసుకొని ప్రయివేటు స్థలాలలోని నర్సరీలను సత్వరమే ప్రభుత్వ స్థలాలోకి మార్చాలని ఎం.పి.డి.ఓలను కలెక్టర్ ఆదేశించారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే నాటిన మొక్కలన్నీ సజీవంగా ఉండేలా సంరక్షణ చర్యలు ఉండాలని మొక్కలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామపంచాయితీ ట్రాక్టర్ల ద్వారా మొక్కలకు నీటి సరఫరా జరగాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఇంకనూ పెండింగ్లో ఉన్న రైతు కల్లాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

కోడ్-19 వ్యాక్సినేషన్ తీసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ తప్పనిసరిగా పి.హెచ్.సిలకు వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా ఎం.పి.డి.ఓలు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా నిరంతర చర్యలు ఉండాలని నిబంధనలను ఉల్లఘించిన బాధ్యులకు జరిమానా విధించాలని కలెక్టర్ సూచించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్రావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post