జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కొరకు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అధికారులకు సూచించారు

పత్రిక ప్రకటన
తేది :05.11.2022
నిర్మల్ జిల్లా శనివారం

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కొరకు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి అధికారులకు సూచించారు.
శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో కలసి మండల వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గత వారం సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
వచ్చే వారం సమీక్షా సమావేశంలో అన్ని సిద్ధం చేసుకొని రావాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లాకు 15000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కేటాయించటం జరిగిందని, నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ నర్సరీని సారంగపూర్ మండలం బీరవెల్లి లో ఏర్పాటు చేయటం జరిగిందని, జిల్లాకు సరిపడా మూడున్నర లక్షల మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే రైతులకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి TSMLP ప్రకారం ఎకరానికి వెయ్యి రూపాయలు డిడి చెల్లించాలని తెలిపారు.
లక్ష్యాలను త్వరితగతిన సాధించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు.
అనంతరం మండలాల వారిగా సాధించిన లక్ష్యాలను ఏ ఓ లను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఏవో లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post